X
47 డేస్

47 డేస్

Mystery | 30 Jun 2020 |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

47 డేస్ స్టోరీ

47 రోజులు సినిమా మిస్ట్రీ, రోమాంటిక్ ఎంటర్టైనర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సత్య దేవ్, పూజ జవేరి, రోషిని, సత్య ప్రకాష్, హరి తేజ, రవి వర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రదీప్ మద్దాలి వహించారు మరియు నిర్మాతలు దబ్బర శశి, భూషన్ నాయిడు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం రఘు కుంచె అందించారు.  కథ వైజాగ్‌లో ఏసీపీగా పనిచేసే సత్య (సత్యదేవ్) ఆరు నెలల సస్పెన్షన్‌లో ఉంటారు. తన భార్య పద్దు (రోషిణి ప్రకాశ్) సూసైడ్ విషాదంతో బాధపడుతూ.. ఆమె మరణం వెనుక కారణాలను అన్వేషిస్తుంటాడు. అదే సమయంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మరణిస్తాడు. ఆ రెండు మరణాలకు పోలీకలు ఉండటంతో అధికారులు దృష్టికి తీసుకెళ్తాడు. అయితే అప్పటికే ఆ కేసు ఫైల్స్ మూసి వేయడం వల్ల దర్యాప్త చేయడానికి పోలీసు కమిషనర్ నిరాకరిస్తారు. అయితే తన ప్రయత్నాలను మానుకోకుండా రాజారాం అనే హెడ్ కానిస్టేబుల్‌ సహాయంతో దర్యాప్తు చేస్తుంటాడు. ఈ క్రమంలో జూలియట్ (పూజా జవేరి) అనే యువతి ఈ దర్యాప్తులో కీలకంగా మారుతుంది. తన భార్య పద్దు మరణానికి అసలు కారణమేమిటి? అదే క్రమంలో ఫార్మా కంపెనీ అధినేత శ్రీనివాసరావు మృతి వెనుక వాస్తవాలు ఏమిటి? సత్య దర్యాప్తులో తన స్నేహితుడు, పోలీస్ ఆఫీసర్ రవి (రవి వర్మ) ఎలాంటి పాత్ర పోషించాడు? ఇక రాజారాం హెడ్ కానిస్టేబుల్ (శ్రీకాంత్ అయ్యంగార్) ఎలాంటి సహకారం అందించారు. వేర్వేరు సంవత్సరాల్లో ఒకే రోజు జరిగిన రెండు మరణాలు లింక్ ఏమైనా ఉందా? జూలియట్ ఈ దర్యాప్తులో ఎంత వరకు ఉపయోగపడిందనే చిక్కు ముడులకు సమాధానమే 47 డేస్ సినిమా కథ.
Read More

47 డేస్ కాస్ట్ & క్రూ

47 డేస్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రదీప్ మద్దాలి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం రఘు కుంచే
నిర్మాత దబ్బర శశి, భూషన్ నాయిడు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

47 డేస్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఓవరాల్‌గా 47 డేస్ గురించి చెప్పాల్సి వస్తే.. ఎలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేని సాదాసీదా క్రైం థ్రిల్లర్. బలహీనమైన స్క్రీన్ ప్లే, సరైన కథాబలం లేకుండా తీసిన సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. సత్యదేవ్, శ్రీకాంత్ అయ్యంగార్ ఫెర్ఫార్మెన్స్‌ కారణంగా సినిమాకు కాస్త గౌరవం దక్కే అవకాశాలు పెరిగాయి. దర్శకుడిగా ప్రదీప్ మద్దాలి ప్రయత్నంలో నిజాయితీ కనిపించినా కథలో లోపాల కారణంగా ఆశించినంత ఫలితం దక్కకపోవచ్చు.

47 డేస్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

47 డేస్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+