అ ఆ (అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి) సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, సమంత, అనన్య, అనుపమ పరమేశ్వరం, శ్రీనివాస్ అవసరాల, బ్రహ్మానందం, అలీ, ప్రవీన్, నదియా, నరేష్, రావు రమేష్, అజై, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ వి, హరి తేజా, పోసాని కృష్ణా మురళి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.
కథ
పారిశ్రామిక వేత్త మహాలక్ష్మి (నదియా). తన భర్త రామలింగం(నరేష్) తన కూతురు అనసూయ (సమంత) ఇద్దరూ తనమాటే వినాలనే నియంత మనస్తత్వం ఆమెది. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా తన ఇష్టా యిష్టాలకి అనుగుణంగా కూతురుని పెంచుతున్న ఆమెకు తన భర్త,కూతుళ్లు ఇద్దరికీ తనంటే ఇష్టం లేదనే విషయం అర్దం కాదు. అలాంటి మహాలక్ష్మి రొటీన్ గానే తన కూతురుకి ఓ మిలియనీర్ పెళ్లి సంభంధం కుదిర్చే ప్రయత్నాలు మొదలెడుతుంది. అయితే అంతకన్నా రొటీన్ గా మన హీరోయిన్ కి ఈ సంభంధం అంటే ఇష్టం ఉండదు. కాకపోతే రొటీన్ ని బ్రేక్ చేసి ఆమె సూసైడ్ ఎటెమ్ట్ చేస్తుంది. అప్పుడైనా ఆ కరుడుకట్టిన తీవ్రవాది లాంటి ఆ తల్లి మారిందా అంటే .. ఆ అహంకారాన్ని అణచటానికి పల్లెటూరు మొనగాడు లాంటి అల్లుడు రావాలాయే. ఆ సమయం రానే వచ్చింది. మహాలక్ష్మి.. చెన్నై బిజినెస్ టూర్ కు వెళితే..ఇంట్లో ఉండలేని అనసూయ... తన తల్లికి తెలియకుండా తన మామయ్య గారి పల్లెకు తొలిసారి వెళ్తుంది. ఎప్పుడూ చూడని ప్రేమ, అనురాగాలు అక్కడ చూసి మైమరిచిపోతుంది. అంతేనా అక్కడ ఆమె..తన బావ ఆనంద్ విహారి (నితిన్)తో ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే ఆనంద్ ని అదే ఊరుకు చెందిన వల్లి (అనుపమ) పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిపోయి ఉంటుంది. ఈ పరిస్దితుల్లో అనసూయ ఏం చేసింది. మహాలక్ష్మి లో మార్పు వచ్చిందా...అసలు అనసూయ కుటుంబానికి, తన మామయ్య కుటుంబానికి మధ్య ఉన్న గొడవలు ఏంటి...వంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.