X
అ ఆ

అ ఆ

Romance | 02 Jun 2016 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

అ ఆ స్టోరీ

అ ఆ (అనసూయ రామలింగం v/s ఆనంద్ విహారి) సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నితిన్, సమంత, అనన్య, అనుపమ పరమేశ్వరం, శ్రీనివాస్ అవసరాల , బ్రహ్మానందం, అలీ, ప్రవీన్, నదియా, నరేష్, రావు రమేష్, అజై, శ్రీనివాస్ రెడ్డి, జయప్రకాష్ వి, హరి తేజా, పోసాని కృష్ణా మురళి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాత కె రాధాకృష్ణన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీ జె మేయర్ స్వరాలు సమకుర్చరు.  కథ పారిశ్రామిక వేత్త మహాలక్ష్మి (నదియా). తన భర్త రామలింగం(నరేష్) తన కూతురు అనసూయ (సమంత) ఇద్దరూ తనమాటే వినాలనే నియంత మనస్తత్వం ఆమెది. బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్ లాగా తన ఇష్టా యిష్టాలకి అనుగుణంగా కూతురుని పెంచుతున్న ఆమెకు తన భర్త,కూతుళ్లు ఇద్దరికీ తనంటే ఇష్టం లేదనే విషయం అర్దం కాదు. అలాంటి మహాలక్ష్మి రొటీన్ గానే తన కూతురుకి ఓ మిలియనీర్ పెళ్లి సంభంధం కుదిర్చే ప్రయత్నాలు మొదలెడుతుంది. అయితే అంతకన్నా రొటీన్ గా మన హీరోయిన్ కి ఈ సంభంధం అంటే ఇష్టం ఉండదు. కాకపోతే రొటీన్ ని బ్రేక్ చేసి ఆమె సూసైడ్ ఎటెమ్ట్ చేస్తుంది. అప్పుడైనా ఆ కరుడుకట్టిన తీవ్రవాది లాంటి ఆ తల్లి మారిందా అంటే .. ఆ అహంకారాన్ని అణచటానికి పల్లెటూరు మొనగాడు లాంటి అల్లుడు రావాలాయే. ఆ సమయం రానే వచ్చింది. మహాలక్ష్మి.. చెన్నై బిజినెస్ టూర్ కు వెళితే..ఇంట్లో ఉండలేని అనసూయ... తన తల్లికి తెలియకుండా తన మామయ్య గారి పల్లెకు తొలిసారి వెళ్తుంది. ఎప్పుడూ చూడని ప్రేమ, అనురాగాలు అక్కడ చూసి మైమరిచిపోతుంది. అంతేనా అక్కడ ఆమె..తన బావ ఆనంద్‌ విహారి (నితిన్‌)తో ప్రేమలో పడుతుంది. అయితే అప్పటికే ఆనంద్ ని అదే ఊరుకు చెందిన వల్లి (అనుపమ) పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యిపోయి ఉంటుంది. ఈ పరిస్దితుల్లో అనసూయ ఏం చేసింది. మహాలక్ష్మి లో మార్పు వచ్చిందా...అసలు అనసూయ కుటుంబానికి, తన మామయ్య కుటుంబానికి మధ్య ఉన్న గొడవలు ఏంటి...వంటి విషయాలు తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. 
Read More

అ ఆ కాస్ట్ & క్రూ

అ ఆ సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత ఎస్ రాధా కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అ ఆ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇది ఫలానా రచయిత రాసిన డైలాగు అని చెప్పగలిగేలా ముద్రవేయటం మామూలు విషయం కాదు. అది త్రివిక్రమ్ సాధించాడు. త్రివిక్రమ్...ఫీల్ గుడ్ ప్రేమ కథలకు బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా రొమాంటిక్ కామెడీలు తొలినాళ్లలో వండర్స్ సృష్టించి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. దర్శకుడుగా మారాక యాక్షన్ ఎంటర్టైనర్స్ వైపు కు టర్న్ తీసుకున్న ఆయన అత్తారింటికి దారేదితో మళ్లీ తనదైన శైలి ఫ్యామిలీ డ్రామాల వైపు దృష్టి పెట్టారు. ఇది త్రివిక్రమ్ సినిమా కాదు..కాదు... నితిన్ సినిమా ఇలా రెండు విధాలుగా ఎక్సెపెక్ట్ చేసి వెళితే మీరు బోల్తా పడినట్లే... ఎందుకంటే ఇది ఖచ్చితంగా హండ్రడ్ పర్శంట్ సమంత సినిమా. ఆమె చుట్టూ అల్లిన కథ. ఆమె ఫెరఫార్మెన్స్ తో నడిచిన కథ. ఆమెను హైలెట్ చేయటం కోసమే అన్నట్లుగా త్రివిక్రమ్ తన మార్కుని వదిలేసాడు. నితిన్ అయితే కేవలం ఓ పాత్రలా మిగిలిపోయాడు. ఇలా దర్శకుడు హీరోయిన్ ఓరియెంటెడ్ కథ అనుకున్నప్పుడు, మళయాళి చిత్రం 'ఓం శాంతి ఓషానా' తరహాలో పూర్తిగా ఆమెనే హెలెట్ చేస్తూ, ఓ స్టారడమ్ లేని హీరోని తీసుకుని నడిపితే ఎలాంటి ఇబ్బంది ఉండకపోను. అలా కాకుండా నితిన్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోని సీన్ లోకి తేవటంతో నితిన్ ఏమి చెయ్యడేంటి, అతను తన ప్రేమ కోసం ఎక్కడా ఏ డెషిషన్ తీసుకోడేంటి.. అంటూ తొలిచేస్తూంటుంది. ఎందుకంటే నితిన్ ..తొలి చిత్రం నుంచి ప్రేమ కోసం ఓ రేంజిలో పోరాటాలు చేసిన హీరో కదా. కాబట్టి సమంత సినిమా అనుకుని చూస్తే బాగుందే అనిపిస్తుంది. త్రివిక్రమ్ నుంచి పంచ్ లు, నితిన్ నుంచి ఇంకేమి ఆశించకుండా వెళ్తే హ్యాపీగా అనిపించే వన్ ఉమెన్ షో ఇది. ఆమె అభిమానులు పండుగ చేసుకునే చిత్రం ఇది.

అ ఆ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అ ఆ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+