ఆహా కళ్యాణం సినిమా రోమ్యాంటిక్ కామిడి అనువాద చిత్రం ఇందులో నాని, వాణీకపూర్, సిమ్రాన్, బడవ గోపి, ఎం.జె. శ్రీరామ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎ గోకుల్ క్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య చోప్రా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ధరణ్ స్వరాలు సమకుర్చారు.
కథ
వెడ్డింగ్ ప్లానర్ గా ఎదగాలనుకునే శక్తి సుబ్రమణ్యం(వాణి కపూర్)కి గాలికి తిరిగే శక్తి(నాని) తారసపడతారు..వెంటబడతాడు. మొదట్లో ఒప్పుకోకపోయినా తర్వాత అతతో కలిసి గట్టిమేళం అని వెడ్డింగ్ ఫ్లానింగ్ ఆఫీస్ ఓపెన్ చేస్తుంది. కష్టపడి,ఇష్టపడి చేయటంతో వీరి కంపెనీ త్వరలోనే ఎదుగుతుంది. ఆ ఉత్సాహంలో ..ఆ సెలబ్రేషన్ మూడ్ లో అనుకోని విధంగా ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు. అయితే అతనికి రిలేషన్ షిప్స్ లో ఇరుక్కోవటం ఇష్టం ఉండదు. అక్కడ నుంచివీరిద్దరివి వేరే దారులు అవుతాయి. చివరకు వీరిద్దరూ ఒకటి ఎలా అయ్యారు అనేది మిగతా కథ.