అబ్బాయిగారు సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీన, సుమన్, బ్రహ్మానందం, శ్రీకాంత్, జయచిత్ర, తిరుపతి ప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇ వి వి సత్యనారాయణ నిర్వహించారు మరియు నిర్మాత నరసింహ రావు ఎమ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
దొరబాబు (వెంకటేష్) ఒక పెద్ద భూస్వామి వెంకట్రాయుడు (నూతన్ ప్రసాద్) కూమాడు అన్ని సదుపాయలు కల్గి వుంటాడు. దొరబాబు కి అమ్మ అంటే చాలా ఇష్టం..అలాంటిది కన్న తల్లి చనిపోయిన తర్వత అమ్మ కోసం ఆనారోగ్యం పాలవుతాడు...అప్పుడు తన నాన్న మళ్ళి నాగమణి (జయచిత్ర) ని పెళ్ళి చేసుకుంటాడు. నాగమణి మరియు తన అన్నా(కోట శ్రీనివాస రావు) చాలా కుట్రలు పన్నుతారు..వెంకట్రాయుడిని పిచ్చివాడు అయ్యే టట్లు చేసి..దొరబాబుకు చదవనీకుండా చేసి వాళ్ళు ఏం చేప్పితే అది చేసేటట్లు చేస్తారు. దొరబాబు కు సుధా (మీన) పరిచయం అవుతుంది...ఆపరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్ళిచేసుకుంటారు..వీళ్ళు పెళ్ళిచేసుకోవడం నాగమణికి నచ్చదు ఎందుకంటే సుధా బాగా చదువుకున్న అమ్మాయి కాబట్టి. అక్కడి సుధా వాళ్ళు ఆడుతున్న నాటాకాలను ఎలా భయటపెడుతుంది అలాగే దొరబాబు తన పైన నాగమణి చూపిస్తున్నది కపట ప్రేమ అని ఎలా తేలుస్తుంది అనేది మిగతా కథా...