twitter

    ఆదిపురుష్ స్టోరి

    ఆదిపురుష్ (చెడుపై మంచి సాధించే విజ‌యాన్ని పండ‌గ ‌చేసుకుందాం) మైథలాజికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రోపొందించారు. ఇందులో ప్రభాస్, సైఫ్ ఆలీ ఖాన్, క్రితి సనన్, సన్నీ సింగ్ నిజ్జర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఔం రౌత్‌ వహించారు. ఈ సినిమాకు టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు.
    కథ
    సీతారామ (ప్రభాస్, కృతిసనన్), లక్ష్మణులు వనవాసం చేస్తున్న సమయంలో శ్రీరాముడిని చూసి శూర్పణఖ మనసు పడుతుంది. అయితే తాను వివాహితుడినని శ్రీరాముడు శూర్పణఖ కోరికను తిరస్కరిస్తాడు. దాంతో సీతపై హత్యా ప్రయత్నం చేయబోయిన శూర్ఫణఖ ముక్కును కోసేస్తాడు. తన చెల్లిలికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేక రావణుడు సీతను అపహరిస్తాడు. లంకలో బంధించి పెళ్లాడమని వేధిస్తుంటాడు. సీతా అపహరణ తర్వాత శ్రీరామచంద్రుడు ఎలాంటి వేదనకు గురయ్యాడు? సీత ఆచూకీ తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నించాడు? సీత ఆచూకీని వానరులు చెప్పిన తర్వాత లంక ప్రయాణం ఎలా సాగింది. లంకను చేరుకోవడానికి రామసేతు నిర్మాణం జరిగింది? శ్రీరాముడు, వానర సైన్యంపై రావణసురుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు ఎలా మాయలు చేసి ముప్పు తిప్పలు పెట్టారు. రావణ సంహారం ఎలా జరిగిందనే ప్రశ్నలకు సమాధానమే ఆదిపురుష్ సినిమా. 

    ట్రైలర్‌ మాత్రం రచ్చ లేపింది. టీజర్‌తో వచ్చిన నెగెటివిటీ అంతా ట్రైలర్‌తో పటాపంచలయింది. విజువల్స్‌ వేరే లెవల్లో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ లుక్స్‌ విషయంలో మాత్రం ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ఇక ట్రైలర్‌ చివరి షాట్‌ అయితే మాములుగా లేదు. శివలింగం ముందు సైఫ్‌ అలీఖాన్‌ పూజ చేస్తున్న షాట్‌ అదిరిపోయింది. డైలాగ్స్ అయితే గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్నాయి. ఇక ట్రైలర్‌తో సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. 

    ఆదిపురుష్ ఫ్యాన్స్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

    రిలీజ్ 
    పాన్ ఇండియా లెవల్లో జూన్ 16వ తేదీన ఐదు భాషల్లో ఆదిపురుష్ సినిమా విడుదలైంది.  
    **Note:Hey! Would you like to share the story of the movie ఆదిపురుష్ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X