ఏజెంట్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, మమ్మూట్టి, సాక్షి వైద్య, డినో మోరియా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి వహించారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు, ఈ సినిమాకి కథ వక్కంతం వంశీ అందించారు.
కథ
దేశ భద్రతను కాపాడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఏజెంట్‌గా పనిచేయాలని రామకృష్ణ అలియాస్ రిక్కి (అఖిల్ అక్కినేని) కలలు కంటాడు. రా చీఫ్ మహాదేవ్ అలియాస్ గురూజీ (మమ్ముట్టి)ని తన గురువుగా భావిస్తుంటాడు. దూకుడుతనం, చంచలత్వం కారణంగా పలుమార్లు రా సంస్థలో ఉద్యోగానికి రిజెక్ట్ అవుతాడు. దేశాన్ని సర్వనాశనం చేయాలనుకొంటున్న ధర్మ అలియాస్ గాడ్ (డినో మారియా)ను అడ్డుకోవడానికి మహాదేవ్ ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎథికల్ హ్యాకర్ అంటూ తారసపడిన రిక్కినీ మహాదేవ్ రా ఏజెంట్‌గా నియమిస్తాడు. రిక్కీ ఎందుకు ఎథికల్ హ్యాకర్‌గా మారాడు? రిక్కి ఎందుకు రా సంస్థలో చేరాలనుకొన్నాడు? ధర్మ ఎందుకు గాడ్ అవతారం ఎత్తాడు? తాను ప్రాణంగా ప్రేమించే ప్రియురాలు (సాక్షి వైద్య)ను ఏ కారణంగా వదిలేస్తాడు? కేంద్ర మంత్రి జై కిషన్ (సంపత్ రాజ్), అతడి కుమారుడిని ఎందుకు రిక్కీ చంపాడు? తాను గురువుగా భావించే మహాదేవ్‌ను రిక్కీ ఎందుకు చంపాడు? చివరకు గాడ్ దుష్ట ప్రయత్నాలను రిక్కీ ఎలా అడ్డుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏజెంట్ సినిమా.
రిలీజ్ డేట్
భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలైంది
ట్రైలర్
ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్, యాక్షన్, విజువల్ అంశాలతో ఏజెంట్ ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి. ట్రైలర్‌లో అఖిల్ బాడీ, యాక్షన్ సీన్స్‌తో పాటు వైల్డ్ లుక్ అదిరింది. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. చెప్పాలంటే ట్రైలర్ అంచనాలను మించింది. ఈ మూవీలో హీరో అఖిల్ పాత్ర వైల్డ్ గా సాగడంతో పాటు ఆద్యంతం ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.