X
తెలుగు » సినిమాలు » ఏజెంట్‌
ఏజెంట్‌

ఏజెంట్‌

Action | 28 Apr 2023 | U/A | 156 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఏజెంట్‌ స్టోరీ

ఏజెంట్‌ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్  చిత్రం ఇందులో అఖిల్ అక్కినేని, మమ్మూట్టి, సాక్షి వైద్య, డినో మోరియా  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి వహించారు. నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు, ఈ సినిమాకి కథ వక్కంతం వంశీ అందించారు.    కథ దేశ భద్రతను కాపాడే రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ (రా)లో ఏజెంట్‌గా పనిచేయాలని రామకృష్ణ అలియాస్ రిక్కి (అఖిల్ అక్కినేని) కలలు కంటాడు. రా చీఫ్ మహాదేవ్ అలియాస్ గురూజీ (మమ్ముట్టి)ని తన గురువుగా భావిస్తుంటాడు. దూకుడుతనం, చంచలత్వం కారణంగా పలుమార్లు రా సంస్థలో ఉద్యోగానికి రిజెక్ట్ అవుతాడు. దేశాన్ని సర్వనాశనం చేయాలనుకొంటున్న ధర్మ అలియాస్ గాడ్ (డినో మారియా)ను అడ్డుకోవడానికి మహాదేవ్ ప్రయత్నిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎథికల్ హ్యాకర్ అంటూ తారసపడిన రిక్కినీ మహాదేవ్ రా ఏజెంట్‌గా నియమిస్తాడు. రిక్కీ ఎందుకు ఎథికల్ హ్యాకర్‌గా మారాడు? రిక్కి ఎందుకు రా సంస్థలో చేరాలనుకొన్నాడు? ధర్మ ఎందుకు గాడ్ అవతారం ఎత్తాడు? తాను ప్రాణంగా ప్రేమించే ప్రియురాలు (సాక్షి వైద్య)ను ఏ కారణంగా వదిలేస్తాడు? కేంద్ర మంత్రి జై కిషన్ (సంపత్ రాజ్), అతడి కుమారుడిని ఎందుకు రిక్కీ చంపాడు? తాను గురువుగా భావించే మహాదేవ్‌ను రిక్కీ ఎందుకు చంపాడు? చివరకు గాడ్ దుష్ట ప్రయత్నాలను రిక్కీ ఎలా అడ్డుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏజెంట్ సినిమా.    రిలీజ్ డేట్  భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలైంది ట్రైలర్  ఆద్యంతం ఆకట్టుకునే థ్రిల్లింగ్, యాక్షన్, విజువల్ అంశాలతో ఏజెంట్ ట్రైలర్ అదిరిపోయింది అనే చెప్పాలి. ట్రైలర్‌లో అఖిల్ బాడీ, యాక్షన్ సీన్స్‌తో పాటు వైల్డ్ లుక్ అదిరింది. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక పెట్టించింది. చెప్పాలంటే ట్రైలర్ అంచనాలను మించింది. ఈ మూవీలో హీరో అఖిల్ పాత్ర వైల్డ్ గా సాగడంతో పాటు ఆద్యంతం ఆడియన్స్ ని ఫ్యాన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
Read More

ఏజెంట్‌ కాస్ట్ & క్రూ

ఏజెంట్‌ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సురేందర్ రెడ్డి
స్టోరీ వక్కంతం వంశీ
సినిమాటోగ్రఫీ రసూల్ ఏలురు
సంపాదకుడు నవీన్ నూయిల్
సంగీతం తమన్ యస్
నిర్మాత అనిల్ సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఏజెంట్‌ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సాధారణంగా యాక్షన్‌తో కూడిన స్పై థ్రిల్లర్‌లో కథను ఆశించడం తప్పే అవుతుంది. కానీ కొంతైనా ప్రేక్షకుడిని కథకు కనెక్ట్ చేసే ఎమోషనల్ కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ లేకపోవడం వల్ల కేవలం యాక్షన్ డ్రామా చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. కథ, కథనాలు రొటీన్‌గా ఉండటం వల్ల మంచి యాక్షన్ డ్రామాకు గుర్తింపు లేకుండా పోయిందనే అభిప్రాయం కలుగుతుంది. మాస్, యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. సంప్రదాయ ప్రేక్షకులు పెదవి విరిచే అవకాశం ఉంది. యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. బాక్సాఫీస్ జర్నీ ఎలా ఉంటుందో తొలివారం ఆగితే గానీ చెప్పలేం.

ఏజెంట్‌ ట్రైలర్

Video Thumbnail

ఏజెంట్‌ పాటలు

Music Director: తమన్ యస్

ఏజెంట్‌ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఏజెంట్‌

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+