twitter

    అహనా పెళ్ళంట స్టోరి

    అహనా పెళ్ళంట సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, రితూ బర్మేచా, శ్రీహరి, సుబ్బరాజు, అనిత, నాగినీడు, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరభద్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత సుంకర రామ బ్రహ్మం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు కుంచే స్వరాలు సమకుర్చారు.

    కథ

    ముగ్గురు రౌడీ అన్నలు తమ ముద్దుల చెల్లెలుకి చేసే వివాహ ప్రయత్నంలో ఇరుక్కుపోయిన సాప్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు కధే ఈ చిత్రం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సుబ్బు(సుబ్రమణ్యం) రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తల్లి తండ్రిలేని అనాధ, బుద్దిమంతుడు,బ్రహ్మచారి,నిజాయితీపరుడు మరెన్నో లక్షణాలు ఉన్నవాడు.ఇక సంజన(రీతూ బర్మెచ) ఓ ముగ్గురు రౌడీలు(శ్రీహరి,సామ్రాట్,సుబ్బరాజు)ముద్దుల చెల్లెలు. ఆమెకు తన అన్నలు రౌడీలు కావటంతో మ్యారేజ్ సమస్య అవుతుంది( అదేంటి మగపిల్లలు ఎక్కువైన ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళి కూడా సమస్యేనా అనొద్దు). అప్పుడు ఈ అన్నయ్యలు ప్లాన్ చేసి సుబ్బుని తమ బావగా చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. అయితే సుబ్బు అప్పటికే తన ఆపీసులో పనిచేసే అనితతో ప్రేమలో ఉంటాడు. మరి ఈ అన్నయ్యల కోరిక నెరవేరిందా. సుబ్బు ప్రేమించిన అమ్మాయిని ఏం చేసాడు అన్నది మిగతా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie అహనా పెళ్ళంట with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X