అలా మొదలైంది (2011)(U)
Release date
21 Jan 2011
genre
అలా మొదలైంది స్టోరి
అలా మొదలైంది సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, నిత్య మీనన్, స్నేహ ఉల్లాల్, కృతి కర్బందా, ఆశిష్ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బి వి నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కల్యాని మాలిక్ స్వరాలు సమకుర్చారు.
కథ
గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా చూడదగ్గ కథ...కాదు కాదు..కథనం.
**Note:Hey! Would you like to share the story of the movie అలా మొదలైంది with us? Please send it to us ([email protected]).