అమీ తుమీ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, శ్రీనివాస్ అవసరాల, ఈషా, అదితి మైకల్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇంద్రగంటి నిర్వహించారు మరియు నిర్మాత నరసింహా రావు కె సి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు సమకుర్చురు.
కథ
డబ్బు పిచ్చి బాగా ఉన్న జనార్ధన్ రావు సంతానం దీపిక ( ఇషా రెబ్బా), విజయ్ (అవసరాల శ్రీనివాస్). జనార్ధన్ రావుకు ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి గంగాధర్ అంటే గిట్టదు. జనార్ధన్ రావు కూతురు దీపిక అనంత్ అనే సేల్స్ మేనేజర్‌ను ప్రేమిస్తుంది. కానీ జనార్ధన్ రావుకు ఇష్టముండదు. అలాగే జనార్ధన్ రావు కుమారుడు విజయ్ గంగాధర్ కూతురు మాయ (అదితి మైక్యాల్)ను ప్రేమిస్తాడు. ఇలా రెండు ప్రేమ జంటలకు తండ్రులు ఆమోదం ఉండదు. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలనుకొంటుండగా వైజాగ్ చెందిన శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్) వీరి కథలోకి ప్రవేశిస్తాడు. శ్రీ చిలిపితో జనార్ధన్ రావు తన కూతురి పెళ్లిచూపులను ఏర్పాటు చేస్తాడు. శ్రీ చిలిపిది విచిత్రమైన సమస్య. తమ వంశంలో పెళ్లి కూతురును ఫోటో చూడకుండా పెళ్లి చూపులకు వెళ్లడం ఆచారం. అలా చిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చూపులకొచ్చిన శ్రీ చిలిపి దీపికను పెళ్లి చేసేకొంటాడా? విజయ్, దీపిక ప్రేమ వ్యవహారం, విజయ్, మాయల అఫైర్ ఎలా సుఖాంతమైంది. వారి తండ్రులు ఏలా వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ కథలో జనార్ధన్ రావు ఇంట్లో పనిమనిషి కుమారి (శ్యామల) పాత్ర ఏంటి? పెళ్లి చూపులకు వచ్చిన శ్రీ చిలిపి కుమారిని ఎందుకు ఇష్ణపడాల్సి వచ్చింది. వారి మధ్య జరిగిన సరదా ప్రేమ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే అమీ తుమీ చిత్ర కథ.