X
తెలుగు » సినిమాలు » అమీ తుమీ
అమీ తుమీ

అమీ తుమీ

Comedy | Romance | 09 Jun 2017 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

అమీ తుమీ స్టోరీ

అమీ తుమీ సినిమా కామిడి రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, శ్రీనివాస్ అవసరాల, ఈషా, అదితి మైకల్, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఇంద్రగంటి నిర్వహించారు మరియు నిర్మాత నరసింహా రావు కె సి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ స్వరాలు సమకుర్చురు.  కథ డబ్బు పిచ్చి బాగా ఉన్న జనార్ధన్ రావు సంతానం దీపిక ( ఇషా రెబ్బా), విజయ్ (అవసరాల శ్రీనివాస్). జనార్ధన్ రావుకు ఒకప్పటి తన వ్యాపార భాగస్వామి గంగాధర్ అంటే గిట్టదు. జనార్ధన్ రావు కూతురు దీపిక అనంత్‌ అనే సేల్స్ మేనేజర్‌ను ప్రేమిస్తుంది. కానీ జనార్ధన్ రావుకు ఇష్టముండదు. అలాగే జనార్ధన్ రావు కుమారుడు విజయ్ గంగాధర్ కూతురు మాయ (అదితి మైక్యాల్)ను ప్రేమిస్తాడు. ఇలా రెండు ప్రేమ జంటలకు తండ్రులు ఆమోదం ఉండదు. ఎలాగైనా తమ ప్రేమను గెలిపించుకోవాలనుకొంటుండగా వైజాగ్ చెందిన శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్) వీరి కథలోకి ప్రవేశిస్తాడు. శ్రీ చిలిపితో జనార్ధన్ రావు తన కూతురి పెళ్లిచూపులను ఏర్పాటు చేస్తాడు. శ్రీ చిలిపిది విచిత్రమైన సమస్య. తమ వంశంలో పెళ్లి కూతురును ఫోటో చూడకుండా పెళ్లి చూపులకు వెళ్లడం ఆచారం. అలా చిత్రమైన పరిస్థితుల్లో పెళ్లి చూపులకొచ్చిన శ్రీ చిలిపి దీపికను పెళ్లి చేసేకొంటాడా? విజయ్, దీపిక ప్రేమ వ్యవహారం, విజయ్, మాయల అఫైర్ ఎలా సుఖాంతమైంది. వారి తండ్రులు ఏలా వారికి ఆశీస్సులు అందజేశారు. ఈ కథలో జనార్ధన్ రావు ఇంట్లో పనిమనిషి కుమారి (శ్యామల) పాత్ర ఏంటి? పెళ్లి చూపులకు వచ్చిన శ్రీ చిలిపి కుమారిని ఎందుకు ఇష్ణపడాల్సి వచ్చింది. వారి మధ్య జరిగిన సరదా ప్రేమ సన్నివేశాలు ఎలా ఉన్నాయి? అనే ప్రశ్నలకు సమాధానమే అమీ తుమీ చిత్ర కథ.
Read More

అమీ తుమీ కాస్ట్ & క్రూ

అమీ తుమీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం ఇంద్రగంటి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత నరసింహా రావు కె సి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అమీ తుమీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పాత్రల పరిచయం, పాత్ర స్వభావం, ఇతర కథా కమామీషుతో కాలం గడిచిపోతుంది. చాలా రొటీన్‌గా సాగిపోతున్న ఈ కథలో శ్రీ చిలిపి పాత్ర ప్రవేశించిన తర్వాత ఓ జర్క్ వస్తుంది. సాదాసీదాసినిమా సినిమా చూస్తున్నామన్న ప్రేక్షకుడికి కాస్త జోష్ వస్తుంది. శ్రీ చిలిపిగా వెన్నెల కిషోర్ సినిమాకు వెన్నముకగా మారడంతో ఇంటర్వెల్ వరకు కొంచెం ఆసక్తి కలుగుతుంది. తొలిభాగంలో పనిమనిషి కుమారి, శ్రీ చిలిపి మధ్య సీన్లు, శ్రీ చిలిపి, జనార్ధన్ రావు మధ్య వచ్చే సన్నివేశాలు, డైలాగులు, పంచ్‌లు వినోదాన్ని అందిస్తాయి. ఇక రెండో భాగంలో ఇషా రెబ్బా, అడివి శేషు, అవసరాల శ్రీనివాస్, మాయ, వెన్నెల కిషోర్, శ్యామల ఇలా మూడు జంటల మధ్య ప్రేమ వ్యవహారం దర్శకుడు ఎలా క్లైమాక్స్‌ వరకు తీసుకెళ్లాడనేది ప్రధాన అంశం. ద్వితీయార్థంలో కూడా కామెడీకి వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణినే నమ్ముకొన్నాడు. కాకపోతే వారి మధ్య వచ్చే సీన్లలో సత్తా లేకపోవడం, మొదటి నుంచి చివరి వరకు ఓకే తరహాలో డైలాగ్స్, తెర మీద ఇప్పటికే వందలసార్లు చూసిన సీన్లు మళ్లీ ఈ సినిమాలో రిపీట్ కావడంతో సినిమా ఆసక్తికరంగా అనిపించదు. దర్శకుడు ఇంద్రగంటి సినిమాలను చూస్తే ఆరోగ్యకరమైన కత, దాని చుట్టూ హాస్యం, బలమైన సన్నివేశాలు అల్లుపోయినట్టు కనిపిస్తాయి. ఇంద్రగంటి చిత్రాల చాయలు, ఆయన మార్కు టేకింగ్ అమీ తుమీలో ఎక్కడా కనిపించకపోవడం ప్రధాన లోపం.

అమీ తుమీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

అమీ తుమీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+