అమిగోస్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నందమూరి కల్యాణ్ రామ్, అషికా రంగనాథ్, నితిన్ ప్రసన్న తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజేంద్ర రెడ్డి వహించారు. నిర్మతలు నవీన్, వై రవి శంకర్ నిర్మించారు . సంగీతం ఘిబ్రన్ అందించారు.
జయాపజయాలతో సంబంధం లేకుండా సొంత బేనర్లో కొత్త దర్శకులను నమ్మి భారీ ప్రయత్నాలు చేస్తుంటాడు నందమూరి కళ్యాణ్ రామ్.వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ బింబిసారా సూపర్ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసాడు.కమర్షియల్ సినిమాలు కాదు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న కళ్యాణ్ రామ్ ఇక కథలు ఎంపికలో ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో ప్రేక్షకులు చూడని కొత్త కథలను ఎంచుకుంటూ సర్ ప్రైస్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు కళ్యాణ్ రామ్.
కథ
రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే సిద్దూ (కల్యాణ్ రామ్) తొలి చూపులోనే ఇషికా (అషికా రంగనాథ్) ప్రేమలో పడుతాడు. ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో సిద్దూ, ఇషికా నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. ఈ క్రమంలో మనిషిని పోలిన మనుషుల గురించి తెలిపే వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవడంతో మంజునాథ్, మైఖేల్ అలియాస్ బిపిన్ రాయ్ పరిచయం అవుతారు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ జాతీయ భద్రతాధికారులకు చిక్కిపోతాడు. ఇక సిద్దూ స్థానంలోకి వచ్చి మైఖేల్ వారి ఇంట్లో తిష్టవేస్తాడు. మైఖేల్ ఎవరు? దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి కుట్రలు చేశాడు? సిద్దూ, మంజునాథ్‌ను ఎలా వాడుకొన్నాడు. మైఖేల్ చేసిన కుట్రకు మంజునాథ్ ఎలాంటి కష్టాల్లో ఇరుక్కొన్నాడు? మైఖేల్ చెరలో ఉన్న తన కాబోయే భార్య ఇషికాను ఎలా కాపాడుకొన్నాడు. మైఖేల్ కుట్రలకు సిద్దూ ఎలా చెక్ చెప్పాడు? తనను పోలిన మనుషులను కలువడం ద్వారా సిద్దూ జీవితంలో జరిగిన మంచి, చెడులు ఏమిటనే ప్రశ్నలకు సమాధానమే అమిగోస్ సినిమా కథ.