అందాల రాక్షసి సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, రాహుల్, లావణ్య, ప్రగతి, సీవీఎల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హను రాఘవపూడి నిర్వహించారు మరియు నిర్మాతలు: సాయి కొర్రపాటి, ఎస్.ఎస్.రాజమౌళి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రధన్ స్వరాలు సమకుర్చారు.
కథ
బోర్న్ రిచ్ అయిన గౌతమ్ (రాహుల్)ఓ రోజు అనుకోకుండా ఓ అమ్మాయి మిథున (లావణ్య)ని చూసి ఆమే తన అందాల రాక్షసి అని ఫిక్సై ప్రేమలో పడిపోతాడు. అయితే ఆమె సూర్య (నవీన్)అనే మిడిల్ క్లాస్ కళాకారుడితో తో ప్రేమలో మునిగితేలుతూంటుంది. కానీ సూర్య అప్పటికే ఓ యాక్సిడెంట్ లో ఆమెకు దూరమౌతాడు. ఆ జ్ఢాపకాల విషాదంలో ఉన్న ఆమెకు తన ప్రేమతో కొత్త జీవితాన్ని ఇచ్చి దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు గౌతమ్. అంతా సవ్యంగా జరుగుతోంది ఆమె కూడా గతం మర్చిపోయి..గౌతమ్ ని యాక్సెప్టు చేస్తోంది అనుకునే సమయానికి సూర్య బ్రతికే ఉన్నాడనే విషయం తెలుస్తుంది. అప్పుడు గౌతమ్ ఏం నిర్ణయం తీసుకున్నాడు..మిధున పరిస్దితి ఏమిటనేది మిగతా కథ.