అప్పట్లో ఒకడుండేవాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, తాన్యా హోప్, శ్రీ విష్ణు, పోసాని కృష్ణ మురళి, రాజివ్ కనకాల, అదుర్స్ రఘు, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాతలు కృష్ణ విజయ్, ప్రశాంతి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
తొంభైలలో జరిగే ఈ కథలో రైల్వే రాజు(శ్రీ విష్ణు) ఓ పెద్ద క్రికెటర్ అవ్వాలని నిరంతరం తపించే కుర్రాడు. ఈ కుర్రాడు కు ఓ లవర్ ఉంటుంది. లైఫ్ అంతా ఫుల్ ఖుషీగా బిందాస్ గా నడుస్తుంది అనుకున్న సమయంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అతని క్రిమినల్ గా మారే పరిస్దితులు వస్తాయి. రైల్వై రాజు కాస్తా రౌడీ రాజు గా మారతాడు. ఇంతియాజ్ (నారా రోహిత్) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. నక్సల్స్ కు వ్యతిరేకంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. అతి నిజాయితీ పరుడైన అతని ఆలోచనలు, పనులే రైల్వే రాజు జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. రైల్వైరాజు హంతకుడుగా మారటానికి, క్రికెట్ కు దూరమవటానికి కారణం అవుతాడు. రైల్వే రాజుకు ఇంతియాజ్ కు అసలు తగువేంటి..అసలు తన పనేంటో తను చేసుకుబోయే ఓ అతి సాధారణ కుర్రాడు..వెనక ఇంతియాజ్ ఎందుకంత కసిగా పడ్డాడు. రైల్వే రాజు జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసేసాడు..ఇవన్నీ కథలో మెల్లిగా రివీల్ అయ్యే అంశాలు. ఇవి తెరపై చూస్తేనే బాగుంటాయి. బద్ద శత్రువులుగా మారిన ఇంతియాజ్, రైల్వే రాజు జీవితాలు చివరకు ఏ టర్న్ తీసుకున్నాయి. రైల్వే రాజు ప్రేమ కథ ఏమైంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు...వంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ కథ ఆధ్యంతం సాగుతుంది.