X
తెలుగు » సినిమాలు » అప్పట్లో ఒకడుండేవాడు
అప్పట్లో ఒకడుండేవాడు

అప్పట్లో ఒకడుండేవాడు

Action | Romance | 30 Dec 2016 |
Telugu

2.6 /5 Users

3 /5 Filmibeat

అప్పట్లో ఒకడుండేవాడు స్టోరీ

అప్పట్లో ఒకడుండేవాడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, తాన్యా హోప్, శ్రీ విష్ణు, పోసాని కృష్ణ మురళి, రాజివ్ కనకాల, అదుర్స్ రఘు, ప్రభాస్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర నిర్వహిస్తున్నారు మరియు నిర్మాతలు కృష్ణ విజయ్, ప్రశాంతి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.   కథ తొంభైలలో జరిగే ఈ కథలో రైల్వే రాజు(శ్రీ విష్ణు) ఓ పెద్ద క్రికెటర్ అవ్వాలని నిరంతరం తపించే కుర్రాడు. ఈ కుర్రాడు కు ఓ లవర్ ఉంటుంది. లైఫ్ అంతా ఫుల్ ఖుషీగా బిందాస్ గా నడుస్తుంది అనుకున్న సమయంలో ఓ ఊహించని సంఘటన జరుగుతుంది. అతని క్రిమినల్ గా మారే పరిస్దితులు వస్తాయి. రైల్వై రాజు కాస్తా రౌడీ రాజు గా మారతాడు. ఇంతియాజ్ (నారా రోహిత్) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. నక్సల్స్ కు వ్యతిరేకంగా కూంబింగ్ ఆపరేషన్స్ చేస్తూంటాడు. అతి నిజాయితీ పరుడైన అతని ఆలోచనలు, పనులే రైల్వే రాజు జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. రైల్వైరాజు హంతకుడుగా మారటానికి, క్రికెట్ కు దూరమవటానికి కారణం అవుతాడు. రైల్వే రాజుకు ఇంతియాజ్ కు అసలు తగువేంటి..అసలు తన పనేంటో తను చేసుకుబోయే ఓ అతి సాధారణ కుర్రాడు..వెనక ఇంతియాజ్ ఎందుకంత కసిగా పడ్డాడు. రైల్వే రాజు జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసేసాడు..ఇవన్నీ కథలో మెల్లిగా రివీల్ అయ్యే అంశాలు. ఇవి తెరపై చూస్తేనే బాగుంటాయి. బద్ద శత్రువులుగా మారిన ఇంతియాజ్, రైల్వే రాజు జీవితాలు చివరకు ఏ టర్న్ తీసుకున్నాయి. రైల్వే రాజు ప్రేమ కథ ఏమైంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..ఎవరు ఓడారు...వంటి ఆసక్తికరమైన ప్రశ్నలతో ఈ కథ ఆధ్యంతం సాగుతుంది.
Read More

అప్పట్లో ఒకడుండేవాడు కాస్ట్ & క్రూ

అప్పట్లో ఒకడుండేవాడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సాగర్ కె చంద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత కృష్ణ విజయ్, ప్రశాంతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

అప్పట్లో ఒకడుండేవాడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమా చూస్తూంటే దర్శకుడుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రభావం ఉందనిపిస్తుంది. కథని ఎత్తుకోవటం, సీన్ ల్లో , చెప్పే డైలాగుల్లో సహజత్వానికి ప్రయారిటీ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ సినిమా చూస్తూంటే వర్మ సూపర్ హిట్ సత్య గుర్తుకు రావటం ఖాయం. అయితే వర్మ తరహా మేకింగ్ ఎన్నో సార్లు మనం చూసిందే కాబట్టి కొత్తగా అనిపించదు...ఆ మార్గాన్ని వదిలి..సొంత మార్గంలో దర్శకుడు ట్రై చేసి ఉండాల్సిందనిపిస్తుంది. శ్రీవిష్ణు, నారా రోహిత్..ఇద్దరూ పోటీ పడి చేసిన సినిమా. ముఖ్యంగా నారా రోహిత్ అయితే షాకిచ్చే ఫెరఫార్మెన్స్ ఇచ్చాడు. అండర్ ప్లేతో తన సీన్స్ ని లేపి కూర్చోబెట్టాడు. శ్రీవిష్ణు అనే హీరో కమ్ ఫెరఫార్మర్ ...ఒకడున్నాడు..అని ఇండస్ట్రీకి ఈ సినిమా ఖచ్చితంగా చెప్తుంది. చాలా సీన్స్ లో శ్రీవిష్ణు అదరకొట్టాడు. మిగతా వాళ్లు బాగా చేసారు. ఫైనల్ గా ఇది దర్శకుడి కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ చూపించే చిత్రం. రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడేవారు. ఎప్పుడూ అవే కథలా..వీళ్లు మారరా అనుకునేవాళ్లు, తొంభైల్లో మన కలిసి ఉన్న రాష్ట్రంలో పరిస్దితులను, మనకు తెలియని వాటి వెనక దారుణమైన నిజాలను చూడాలి, లేదా గుర్తు చేసుకోవాలనుకునేవారికి ఈ సినిమా బెస్ట్ ఆఫ్షన్.

అప్పట్లో ఒకడుండేవాడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

అప్పట్లో ఒకడుండేవాడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+