X
అరణ్య
Action | 26 Mar 2021 | U/A | 162 Mins
Telugu

అరణ్య స్టోరీ

అరణ్య సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాణా దగ్గుబాటి, జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్,  శ్రియా పిలగోన్కర్, రఘు బాబు‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాల్మన్ ప్రభు వహించారు. ఎరోస్ ఇంటర్నేషనల్ సమస్థ నిర్మించింది. సంగీతం శాంతను మోయిట్ర అందించారు. 

 

కథ 

నరేంద్ర భూపతి అలియాస్ అరణ్య (రానా దగ్గుబాటి) విశాఖకు సమీపంలోని అటవీ ప్రాంతానికి సంరక్షుడిగా వ్యవహరిస్తుంటాడు. అయితే జంతువులు స్వేచ్ఛగా తిరిగే దట్టమైన అడవిలో డీఎల్ఆర్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనే లక్ష్యంతో మంత్రి కనకమేడల రాజగోపాల్ (అనంత్ మహాదేవన్) ప్రయత్నాలు మొదలుపెడుతాడు. మంత్రి ప్రయత్నాలకు అడ్డు తగిలిన అరణ్యను మతిస్థిమితం లేదనే కారణం చూపి జైల్లో వేస్తారు. విలువైన వృక్ష సంపద, అరుదైన జంతుజాలం ఉన్న అటవికి సంరక్షుడిగా అరణ్య ఎందుకు ఉన్నాడు? అసలు నరేంద్ర భూపతి పేరు అరణ్యగా ఎందుకు మారింది. అరణ్యను జైల్లో వేసిన తర్వాత అటవీ ప్రాంతంలో ఉన్న జంతువులు, గ్రామస్థుల పరిస్థితి ఏమిటి? చివరకు మంత్రి రాజగోపాల్ తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించాడా? పర్యావరణానికి విరుద్ధమైన డీఎల్ఆర్ టౌన్‌షిప్‌ను ఆపడానికి అరణ్య ఎలాంటి దీక్షను చేపట్టాడు. ఈ వివాదంలో ప్రధాని జోక్యం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే అరణ్య సినిమా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+