ముద్ర సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్ సిద్దార్థ, లావణ్య త్రిపాటి, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ టి ఎన్ వహించారు మరియు నిర్మాతలు రాజ్ కుమార్ అకెళ్ల, వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్యామ్ సి ఎస్ అందించారు.
కథ
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) బీబీసీ చానెల్‌లో పని చేయాలనే ఆశయంతో ఉంటాడు. అప్పటి వరకు లోకల్ ఛానెల్‌లో పని చేస్తూ యువత పక్కదోవ పట్టడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి వాటిపై రిపోర్టింగ్ చేస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో బీబీసీ నుంచి అర్జున్‌కు ఫోన్ వస్తుంది. చివరకు తన జీవిత ఆశయం నెరవేరుతోందన్న సంతోషంలో ఉండగా.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో బ్యాంకులను మోసం చేశాడన్న కారణంతో అర్జున్‌ను అరెస్ట్ చేస్తారు. నకిలీ సర్టిఫికేట్ల కుంభకోణంలో అర్జున్ ఎలా ఇరుక్కున్నాడు? అర్జున్ మెడకు ఈ కుంభకోణం చుట్టుకోవడానికి గల కారణాలేంటి? ఈ స్కామ్ వెనుక ఉన్న ముఠా ఎవరు? నకిలి సర్టిఫికెట్ల కుంభకోణానికి కారణమైన బయటకు ఎలా తీసుకొచ్చాడు? ఈ కుంభకోణంలో అర్జున్ నిర్దోషిగా తేలాడా? చివరకు ఈ కేసు నుంచి అర్జున్ ఎలా బయటపడ్డాడన్ననే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ సురవరం