అసుర (2015)(U/A)
Release date
05 Jun 2015
genre
అసుర స్టోరి
అసుర సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్, ప్రియా బనెర్జీ, రవి వర్మ, నరేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కృష్ణ విజయ్ నిర్వహించారు మరియు నిర్మాత శయం దేవభక్తుని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
జైలర్ ధర్మతేజ (నారా రోహిత్). సిన్సియర్ ఆఫీసర్. తన జైలును అహర్నిశలు రక్షించడానికే ఉంటాడు. ఉద్యోగంలో పని రాక్షసుడుగా పేరు సంపాదిస్తాడు. రూల్స్ కన్నా రిజల్సే ముఖ్యం అనుకుంటాడు. జైలుకి చంద్రశేఖర్ అలియాస్ చార్లీ(రవి వర్మ) అనే కొత్త ఖైదీ వస్తాడు. సంపన్నుడైన దిలీప్ కొఠారికి మొదటి భార్యకొడుకు. తండ్రి చనిపోవడంతో రెండవభార్య భారతీదేవి(రూపాదేవి) ని చేరువ కానివ్వకపోగా ఆమె ముగ్గురుపిల్లల్ని చంపేస్తాడు. చార్లీకి పడ్డ ఉరిశిక్షకు క్షమాభిక్ష దొరకదు. ఎలాగైనా జైలునుండి తప్పించుకోవాలని మరో ఖైదీ పాండూ సహాయంతో బయటవున్న ముత్యంనాయుడు, దయ గ్యాంగ్ తో సంబంధం పెట్టుకుంటాడు. వారి సహాయంతో ధర్మ ప్రియురాలిని (ప్రియా బెనర్జీ), మేజిస్ర్టేట్ కొడుకును, ఉరి తీసే తలారి తల్లిని కిడ్నాప్ చేయిస్తాడు. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది.
**Note:Hey! Would you like to share the story of the movie అసుర with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు