బేబీ మూవీ రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ దేవరకొండ, వైష్టవి చైతన్య, విరాజ్ అశ్విన్, వైవా హర్ష, నాగేంద్ర బాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్.దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మంచారు. సంగీతం విజయ్ బుల్గనిన్ అందించారు.
కథ
బస్తీలో పేదరికం మధ్య పుట్టి పెరిగిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) బాల్య స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదివిన ఈ ఇద్దరు ఒకరినొకరిని విడదీయలేనంత ప్రేమలో ఉంటారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆటో నడుపుతూ ఆనంద్ జీవితం కొనసాగిస్తుంటే.. వైష్ణవి ఇంటర్ పాసై ఇంజనీరింగ్‌లో చేరుతుంది. (Baby Telugu Movie Review) ఇంజనీరింగ్ కాలేజీలో తన క్లాస్‌మెట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)తో పరిచయం ఏర్పడుతుంది. కాలేజ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేసే విరాజ్‌తో వైష్ణవి 31 రోజులు డేటింగ్ చేయాల్సి వస్తుంది. వైష్ణవితో ఆనంద్ ప్రేమ ఎలా మొదలైంది. స్కూల్‌లో వైష్ణవి, ఆనంద్ బంధం ఎలా బలపడింది? కాలేజీలో విరాజ్‌తో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవి ఫ్యాషన్స్‌కు, పబ్ కల్చర్‌కు ఎలా అలవాటు పడింది? విరాజ్ లవ్ ప్రపోజల్‌ను వైష్ణవి ఎందుకు రిజెక్ట్ చేసింది? వైష్ణవిలో మార్పు వల్ల ఆనంద్ ఎలాంటి బాధకు గురయ్యాడు? ఆనంద్ ప్రేమ కోసం వైష్ణవి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఎలాంటి శిక్షకు గురిచేసింది? వైష్ణవి ప్రేమను ఆనంద్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? వైష్ణవి, ఆనంద్, విరాజ్ ట్రాయంగిల్ లవ్ స్టోరికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బేబీ సినిమా.
రిలీజ్
జూలై 14వ తేదీన బేబీ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యింది
ట్రైలర్
పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య ప్రేమ చిగురించే సీన్‍తో బేబీ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ పాత్రలో ఆనంద్ నటిస్తున్నాడు. వీరి ప్రేమ చాలాకాలం చాలా ఆనందంగా సాగుతుంది. అయితే, కాలేజీకి వెళ్లిన తర్వాత విరాజ్ అశ్విన్‍తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. అనంతరం వైష్ణవి జీవితంలో మార్పులు వస్తాయి. వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తాడు. దీంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇద్దరి ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం నుంచి నిజంగా ఆమెను ప్రేమించే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా చేసినట్టు ట్రైలర్‌లో అర్థమవుతోంది. ఎమోషనల్ డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్‍గా నిలిచాయి.