X
బేబీ

బేబీ

Drama | 14 Jul 2023 | U/A | 177 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

బేబీ స్టోరీ

బేబీ మూవీ రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్‌ దేవరకొండ, వైష్టవి చైతన్య, విరాజ్ అశ్విన్, వైవా హర్ష, నాగేంద్ర బాబు తదితరులు కీలక పాత్రలలో నటించారు.. సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే.ఎన్.దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మంచారు. సంగీతం విజయ్ బుల్గనిన్ అందించారు.  కథ బస్తీలో పేదరికం మధ్య పుట్టి పెరిగిన ఆనంద్ (ఆనంద్ దేవరకొండ), వైష్ణవి (వైష్ణవి చైతన్య) బాల్య స్నేహితులు. ఒకే స్కూల్‌లో చదివిన ఈ ఇద్దరు ఒకరినొకరిని విడదీయలేనంత ప్రేమలో ఉంటారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆటో నడుపుతూ ఆనంద్ జీవితం కొనసాగిస్తుంటే.. వైష్ణవి ఇంటర్ పాసై ఇంజనీరింగ్‌లో చేరుతుంది. (Baby Telugu Movie Review) ఇంజనీరింగ్ కాలేజీలో తన క్లాస్‌మెట్ విరాజ్ (విరాజ్ అశ్విన్)తో పరిచయం ఏర్పడుతుంది. కాలేజ్‌లో బెస్ట్ ఫ్రెండ్‌గా ట్రీట్ చేసే విరాజ్‌తో వైష్ణవి 31 రోజులు డేటింగ్ చేయాల్సి వస్తుంది. వైష్ణవితో ఆనంద్ ప్రేమ ఎలా మొదలైంది. స్కూల్‌లో వైష్ణవి, ఆనంద్ బంధం ఎలా బలపడింది? కాలేజీలో విరాజ్‌తో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది? బస్తీలో పుట్టి పెరిగిన వైష్ణవి ఫ్యాషన్స్‌కు, పబ్ కల్చర్‌కు ఎలా అలవాటు పడింది? విరాజ్ లవ్ ప్రపోజల్‌ను వైష్ణవి ఎందుకు రిజెక్ట్ చేసింది? వైష్ణవిలో మార్పు వల్ల ఆనంద్‌ ఎలాంటి బాధకు గురయ్యాడు? ఆనంద్ ప్రేమ కోసం వైష్ణవి తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఎలాంటి శిక్షకు గురిచేసింది? వైష్ణవి ప్రేమను ఆనంద్ ఎందుకు రిజెక్ట్ చేశాడు? వైష్ణవి, ఆనంద్, విరాజ్ ట్రాయంగిల్ లవ్ స్టోరికి ముగింపు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే బేబీ సినిమా. రిలీజ్   జూలై 14వ తేదీన బేబీ చిత్రం థియేటర్లలో విడుదల  అయ్యింది ట్రైలర్ పాఠశాలలో చదువుతున్న సమయంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి మధ్య ప్రేమ చిగురించే సీన్‍తో బేబీ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్‌ పాత్రలో ఆనంద్ నటిస్తున్నాడు. వీరి ప్రేమ చాలాకాలం చాలా ఆనందంగా సాగుతుంది. అయితే, కాలేజీకి వెళ్లిన తర్వాత విరాజ్ అశ్విన్‍తో వైష్ణవికి పరిచయం ఏర్పడుతుంది. అనంతరం వైష్ణవి జీవితంలో మార్పులు వస్తాయి. వైష్ణవిని విరాజ్ ప్రేమిస్తాడు. దీంతో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం సాగుతుందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇద్దరి ప్రేమ మధ్య నగిలే అమ్మాయిలా వైష్ణవి, చిన్నతనం నుంచి నిజంగా ఆమెను ప్రేమించే పాత్రలో ఆనంద్ దేవరకొండ అద్భుతంగా చేసినట్టు ట్రైలర్‌లో అర్థమవుతోంది. ఎమోషనల్ డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో హైలైట్‍గా నిలిచాయి.
Read More

బేబీ కాస్ట్ & క్రూ

బేబీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సాయి రాజేష్
సినిమాటోగ్రఫీ ఎమ్ ఎన్ బాల్ రెడ్జి
సంపాదకుడు విప్లవ్ నైషధం
సంగీతం విజయ్ బుల్గనిన్
నిర్మాత ఎస్ కే ఎన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బేబీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, ఎమోషన్స్‌తోపాటు ఆర్టిస్టుల ఫెర్ఫార్మెన్స్ పుష్కలంగా ఉన్న చిత్రం బేబీ. పరిస్థితులను బట్టి జీవితంలో ఓ సారి గుండె బలంగా పగులుతుందేమో. కానీ మూడు గంటల బేబీ సినిమాలో పలు మార్లు గుండె కోత తప్పదు. ఆనంద్, వైష్ణవి, విరాజ్ ఒకరిని మించి ఒకరు ఫెర్ఫార్మ్ చేశాడు. సాయి రాజేష్ టేకింగ్ అద్బుతంగా ఉంది. కథను నిర్మాతగా ఎస్కేఎన్ నమ్మిన తీరుకు హ్యాట్సాఫ్. గత పదేళ్లలో వచ్చిన అద్బుతమైన ప్రేమ కథా చిత్రాల్లో బేబీ ఒకటని చెప్పవచ్చు. పాత్రలతో ప్రేమలో పడేలా.. భావోద్వేగానికి గురయ్యేలా చేస్తుంది. గొప్ప అనుభూతిని కలిగించే చిత్రం బేబీ. ఫ్యామిలీ, యూత్, కుర్రకారుకు విశేషంగా ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా. థియేటర్‌లోనే చూసి ఆనందించండి.

బేబీ ట్రైలర్

Video Thumbnail

బేబీ వార్తలు

బేబీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బేబీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+