బలాదూర్ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, అనూష్క , కృష్ణ, సునీల్, బ్రహ్మానందం, చంద్రమోహన్, రాజ రవీంద్ర, పరుచూరి వెంకటేశ్వరరావు, సమీర్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ-స్క్రీన్ ప్లే-దర్శకుడు: ఉదయ్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత డి సురేష్ బాబు నిర్మించారుఉ. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కె ఎమ్ రాధా కృష్ణన్ స్వరాలు సమకుర్చారు.
కథ
బలాదూర్ గా తిరిగే ఓ కుర్రాడు కి అనుకోని స్ధితిలో భాద్యతలు మీద పడితే అతను వాటినెలా నెరవేర్చాడనే పాయింటుతో వచ్చిన ఈ సినిమాలో ఆ కుర్రాడు చంటి(రవితేజ). అతనికో పెదనాన్నరామకృష్ణ(కృష్ణ). ఆయనంటే పిచ్చి ప్రేమ గల చంటి ఆయన గురించే గొడవ పడి కుటుంబంనుండి దూరమవుతాడు. అంతేగాక కృష్ణ కొడుకులు(రాజా రవీంద్ర,సమీర్) ఇద్దరూ సన్నాసులు. మరో ప్రక్క చంటి...భానుమతి (అనూష్క)తో ప్రేమలో పడతాడు. ఇక అప్పటికే ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని పాత పగతో రగిలిపోతున్న విలన్ (ప్రదీప్ రావత్) ఇది అలసుగా తీసుకుని కొత్త కొత్త ప్లాన్స్ వేస్తూంటాడు. కుటుంబం నుంచి దూరమైన చంటి విలన్ నుండి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేదే మిగతా కథ.