బస్తి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రేయన్ కపూర్, ప్రగతి, అభిమాన్యు సింగ్, ముకేష్ రిషి, కోటా శ్రీనివాస రావు, సప్తగిరి, సత్య అక్కల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వాసు మంతేన నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీన్ ఇమ్మిడి స్వరాలు సమకుర్చారు.
కథ
అమ్మిరాజు(ముఖేష్ రిషి), బిక్షపతి (కోట శ్రీనివాసరావు) మధ్య చాలా కాలంగా కుటుంబ గొడవలు, ఫ్యాక్షన్ గొడవలు ఉంటాయి. భిక్షపతి తనయుడు భవాని(అభిమన్యు సింగ్) అమ్మిరాజు మనిషి సిస్టర్‌ను చంపేస్తాడు. దీంతో అతడు బిక్షపతి కూతురు శ్రమంతి(ప్రగతి)ని కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో అమ్మిరాజు బ్రదర్ విజయ్(శ్రేయాన్ కపూర్) విదేశాల నుండి ఇండియా వచ్చి ఫ్యామిలీకి సడెన్ సర్ ప్రైజ్ ఇస్తాడు. ఈ క్రమంలో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది.