భాగ్ సాలే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహ కోడూరి, నేహా సోలంకి, నందిని రాయ్, వర్షిణి, జాన్ విజయ, రాజీవ్ కనకాల, వివా హర్ష ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రణీత్ బి వహించారు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు.
కథ
రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేసే అర్జున్ (శ్రీ సింహా కోడూరి) సంపన్న కుటుంబానికి చెందిన వాడినని మాయ మాటలు చెప్పి గొప్పింటి అమ్మాయి మాయ (నేహా సోలంకి)ను ప్రేమలోకి దింపుతాడు. శ్యామ్యూల్ (జాన్ విజయ్) అనే మాఫియా డాన్ సినీ నటి నళిని (నందిని రాయ్) అంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. షాలి సుకా గజా అనే అరుదైన డైమండ్ రింగ్ తెచ్చి ఇవ్వమని నళిని కోరుతుంది. డైమండ్ రింగ్ ఉన్న మాయ తండ్రి (సంజయ్ స్వరూప్)ను శ్యామూల్ కిడ్నాప్ చేస్తాడు. 25 కోట్ల విలువైన డైమండ్ రింగ్ వెనుక ఉన్న కథ ఏమిటి? అరుదైన వజ్రపుటుంగరం మహత్యం ఏమిటి? ఆ అరుదైన ఉంగరం కోసం ప్రతీ ఒక్కరు ఎందుకు ప్రయత్నిస్తారు? మాయ తండ్రి కోసం అర్జున్ డైమండ్ రింగ్ తీసుకొచ్చే ప్రయత్నం ఎలా జరిగింది? డైమండ్ ఉంగరం కోసం శ్యామూల్, అర్జున్ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకొన్నాయి? (Bhaag Saale Movie Review) ఈ డైమండ్ ఉంగరం ట్విస్టులో రమ్య (వర్షిణి సౌందర్‌రాజన్) రోల్ ఏమిటి? పోలీస్ ఆఫీసరైన భర్త ప్రామిస్ రెడ్డి (సత్య) నుంచి రమ్య ఎందుకు విడాకులు తీసుకోవాలనుకొన్నది? అర్జున్ స్నేహితుడు కిట్టు (సుదర్శన్) ఫస్ట్ నైట్‌కు డైమండ్ ఉంగరం వ్యవహారం అడ్డంకిగా మారింది? చివరకు డైమండ్ ఉంగరం శ్యామూల్‌కు చిక్కిందా? లేదా అర్జున్‌కు చిక్కిందా? అర్జున్ రిచ్ కాదని తెలిసిన తర్వాత మాయ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భాగ్ సాలే సినిమా.
రిలీజ్
ఈ సినిమా జులై 14న విడుదల అయ్యింది
ట్రైలర్
ఓ డైమండ్ రింగు చుట్టూ సాగే కథ ఇది. ఈ మధ్యే సిద్దూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో అసలు సినిమా స్టోరీ మొత్తం ఓ రింగు చుట్టూ ఎలా తిరగబోతోందో.. అసలు ఆ రింగు కథేంటో వివరించారు.