X
తెలుగు » సినిమాలు » భాగ్ సాలే
భాగ్ సాలే

భాగ్ సాలే

Romance | 07 Jul 2023 | U/A | 121 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

భాగ్ సాలే స్టోరీ

భాగ్ సాలే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శ్రీ సింహ కోడూరి, నేహా సోలంకి, నందిని రాయ్, వర్షిణి, జాన్ విజయ, రాజీవ్ కనకాల, వివా హర్ష ఇంకా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రణీత్ బి వహించారు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని కలిసి నిర్మించారు. సంగీతం కాల భైరవ అందించారు.  కథ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేసే అర్జున్ (శ్రీ సింహా కోడూరి) సంపన్న కుటుంబానికి చెందిన వాడినని మాయ మాటలు చెప్పి గొప్పింటి అమ్మాయి మాయ (నేహా సోలంకి)ను ప్రేమలోకి దింపుతాడు. శ్యామ్యూల్ (జాన్ విజయ్) అనే మాఫియా డాన్ సినీ నటి నళిని (నందిని రాయ్) అంటే ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. షాలి సుకా గజా అనే అరుదైన డైమండ్ రింగ్ తెచ్చి ఇవ్వమని నళిని కోరుతుంది. డైమండ్ రింగ్ ఉన్న మాయ తండ్రి (సంజయ్ స్వరూప్)ను శ్యామూల్ కిడ్నాప్ చేస్తాడు. 25 కోట్ల విలువైన డైమండ్ రింగ్ వెనుక ఉన్న కథ ఏమిటి? అరుదైన వజ్రపుటుంగరం మహత్యం ఏమిటి? ఆ అరుదైన ఉంగరం కోసం ప్రతీ ఒక్కరు ఎందుకు ప్రయత్నిస్తారు? మాయ తండ్రి కోసం అర్జున్ డైమండ్ రింగ్ తీసుకొచ్చే ప్రయత్నం ఎలా జరిగింది? డైమండ్ ఉంగరం కోసం శ్యామూల్, అర్జున్ మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకొన్నాయి? (Bhaag Saale Movie Review) ఈ డైమండ్ ఉంగరం ట్విస్టులో రమ్య (వర్షిణి సౌందర్‌రాజన్) రోల్ ఏమిటి? పోలీస్ ఆఫీసరైన భర్త ప్రామిస్ రెడ్డి (సత్య) నుంచి రమ్య ఎందుకు విడాకులు తీసుకోవాలనుకొన్నది? అర్జున్ స్నేహితుడు కిట్టు (సుదర్శన్) ఫస్ట్ నైట్‌కు డైమండ్ ఉంగరం వ్యవహారం అడ్డంకిగా మారింది? చివరకు డైమండ్ ఉంగరం శ్యామూల్‌కు చిక్కిందా? లేదా అర్జున్‌కు చిక్కిందా? అర్జున్ రిచ్ కాదని తెలిసిన తర్వాత మాయ రియాక్షన్ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే భాగ్ సాలే సినిమా.  రిలీజ్  ఈ సినిమా జులై 14న విడుదల అయ్యింది ట్రైలర్  ఓ డైమండ్ రింగు చుట్టూ సాగే కథ ఇది. ఈ మధ్యే సిద్దూ జొన్నలగడ్డ వాయిస్ ఓవర్ తో రిలీజ్ చేసిన టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో అసలు సినిమా స్టోరీ మొత్తం ఓ రింగు చుట్టూ ఎలా తిరగబోతోందో.. అసలు ఆ రింగు కథేంటో వివరించారు.
Read More

భాగ్ సాలే కాస్ట్ & క్రూ

భాగ్ సాలే సిబ్బంది సమాచారం

దర్శకత్వం ప్రణీత్ బి
సినిమాటోగ్రఫీ రమేష్ కుశేన్దర్
సంపాదకుడు కార్తీక్ శ్రీనివాస్
సంగీతం కాల భైరవ
నిర్మాత యష్ రంగినేని, అర్జున్ దాస్యం, సింగనమల కళ్యాణ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

భాగ్ సాలే విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
లవ్, కామెడీ, క్రైమ్ అంశాలతో డైమండ్ ఉంగరం చుట్టూ సాగే డ్రామా భాగ్ సాలే. కథ, కథనాల విషయాలు పక్కన పెడితే.. నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తుంది. అలాగే సాంకేతిక విభాగాల పనితీరు స్క్రిప్టుపరంగా ఉన్న లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేశాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లేతో సాగే కామెడీ సినిమాలను ఇష్టపడే వారికి భాగ్ సాలే నచ్చుతుంది. వైవా హర్ష, సత్య, సుదర్శన్ కామెడీ ఈ సినిమాకు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్. క్రైమ్ బ్యాక్ గ్రౌండ్‌తో వినోదాన్ని ఆశించే ప్రేక్షకులను ఈ సినిమా నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు కనెక్ట్ అయితే శ్రీ సింహా ఖాతాలో హిట్ చేరడం ఖాయం.

భాగ్ సాలే ట్రైలర్

Video Thumbnail

భాగ్ సాలే సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

భాగ్ సాలే

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+