భీమ్లా నాయక్ (2022)(U/A)
Release date
25 Feb 2022
genre
భీమ్లా నాయక్ స్టోరి
భీమ్లా నాయక్ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఇది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యామీనన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాగర్ కె చంద్ర వహించారు. నిర్మాత నాగ వంశి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.
కథ
కర్నూలు జిల్లాలో భీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయితీపరుడైన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. వరంగల్ మాజీ ఎంపీ (సముద్ర ఖని) కుమారుడైన డేనియల్ శేఖర్ (రానా దగ్గుబాటి) రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఏపీ సరిహద్దులో మద్యపానంపై ఆంక్షలు ఉన్న ప్రదేశంలో పీకల దాకా తాగి భీమ్లా నాయక్‌కు పట్టుబడి అరెస్ట్ అవుతాడు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉండటంతో సీఐ సూచన మేరకు డేనియల్ శేఖర్‌కు పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు చేయడమే కాకుండా మద్యం సరఫరా చేస్తారు. ఫలితంగా భీమ్లా నాయక్, మరో లేడి కానిస్టేబుల్ సస్పెండ్‌కు గురవుతారు. భీమ్లా నాయక్ ఏ పరిస్థితుల్లో సస్పెండ్‌కు గురవుతారు? సస్పెండ్ గురైన భీమ్లా నాయక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడు? భీమ్లా నాయక్‌ను డేనియల్ శేఖర్ ఎలాంటి కేసులో ఇరికించాడు? తనను అరెస్ట్ చేసిన భీమ్లా నాయక్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు? భీమ్లా నాయక్ భార్య సుగుణ (నిత్య మీనన్) కూడా డేనియల్ శేఖర్ ఫ్యామిలీ ఎలాంటి కేసులో ఇరికిస్తారు. తన భార్యను అరెస్ట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ రియాక్షన్ ఏమిటి? భీమ్లా నాయక్ నుంచి డేనియల్ శేఖర్‌ను ఆయన భార్య (సంయుక్త మీనన్) ఎలా దక్కించుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే భీమ్లా నాయక్ కథ.
**Note:Hey! Would you like to share the story of the movie భీమ్లా నాయక్ with us? Please send it to us ([email protected]).