X
బిచ్చగాడు 2
Action | 19 May 2023 | U/A | 148 Mins
Telugu

బిచ్చగాడు 2 స్టోరీ

బిచ్చగాడు 2 సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్, హరీష్ పేరడీ, జాన్ విజయ్, రాధా రవి, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం,  సంగీతం:విజయ్ ఆంటోనీ వహించారు. నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మించారు. 

కథ

విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) లక్ష కోట్ల రూపాయల విలువైన బిజినెస్ సామ్రాజ్యానికి అధిపతి. తన చుట్టూ ఉండే ముగ్గురు (హరీష్ పెరడీ, దేవ్ గిల్, జాన్ విజయ్) కుట్రపన్ని విజయ్ గురుమూర్తిని చంపడానికి ప్లాన్ చేస్తారు. విజయ్ గురుమూర్తికి సరిపోయే టిష్యూస్ ఉన్న వ్యక్తిని వెతికి.. అతడి మెదడు ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఆ క్రమంలో దొరికిన బాల నేరస్థుడైన బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని)ని దొరుకుతాడు. సత్యను సృహ కోల్పోయేలా చేసి విజయ్ గురుమూర్తికి సత్య మెదడును ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు. విజయ్ గురుమూర్తికి సత్య మెదడు ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత ఏం జరిగింది? విజయ్ గురుమూర్తి గ్రూపులో ఉండే ముగ్గురు ప్లాన్ వర్కవుట్ అయిందా? సత్య మెదడు పెట్టుకొన్న విజయ్ గురుమూర్తి ఆ ముగ్గురు కుట్రదారుల చేతిలో కీలుబొమ్మగా మారాడా? విజయ్ గురుమూర్తి ప్రియురాలు హేమ (కావ్య థాపర్) పరిస్థితి ఏమైంది? బిచ్చగాడైన సత్య ఎందుకు బాల నేరస్థుడిగా మారాడు? చిన్నతనంలో జైలుకు వెళ్లడం తాను కోల్పోయిన సోదరి రాణిని కలిసేందుకు సత్య ఎలాంటి ప్రయత్నాలు చేపట్టాడు. చివరకు తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే సోదరి రాణిని కలిశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే బిచ్చగాడు సినిమా. 

ట్రైలర్ 
ట్రైలర్‌ లో కొన్ని షాట్స్ చూస్తుంటే కేజీయఫ్ సినిమాలోని షాట్స్‌ను పెట్టినట్టుగా అనిపిస్తోంది. చూస్తుంటే ఈ సినిమాను కూడా పాన్ ఇండియన్ రేంజ్లో రిలీజ్ చేయబోతోన్నట్టుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మాత్రం కథను ఏ మాత్రం కూడా అంచనా వేయలేమన్నట్టుగా ఉంది.

ఈ రెండో పార్ట్‌లో కాన్సెప్ట్ ఎలా ఉంటుంది.. విజయ్ డబుల్ యాక్షన్‌లో నటిస్తున్నాడా? అసలు హీరోయిన్‌కు ఎలాంటి ఇంపార్టెన్స్ లేదా? విలన్ ఎవరు? అన్నట్టుగా ఈ ట్రైలర్‌ అందరినీలోనూ ఆసక్తిని రేకెత్తించేస్తోంది.

రిలీజ్ 
బిచ్చగాడు 2 మూవీని మే 19న  తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాను రిలీజ్ అయ్యింది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+