బింబిసారా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ. ఓ పుణ్యభూమి అందులో బార్భేరియన్ కింగ్.. బింబిసారగా కళ్యాణ్ రామ్ ఇందులో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్, వరీనా హుస్సేన్ హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వశిష్ఠ్ వహించారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.
కథ
త్రిగర్తల అనే ఒక రాజ్యానికి తిరుగులేని రాజుగా ఉంటాడు బింబిసారుడు(కళ్యాణ్ రామ్). అణువణువునా అహంభావంతో కండకావరం ప్రదర్శిస్తూ ఉండే ఆయన రాజ్యకాంక్షతో, ధన దాహంతో చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాడు. అయితే ఒక సందర్భంలో తన సొంత రాజ్యంలోనే ఒక గ్రామాన్ని పూర్తిగా గ్రామస్తులతో కలిపి తగలబెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ క్రమంలో ఆయన ఆ గ్రామస్తుల శాపానికి గురవుతాడు. అలా గురైన బింబిసారుడుటైం ట్రావెల్ ద్వారా ఐదవ శతాబ్దం నుంచి నేటి ఆధునిక సమాజానికి వచ్చేస్తాడు. ఆ వచ్చిన తర్వాత ఈ వెనక్కి వెళతాడా? వెళితే ఎలా వెళ్లాడు? అసలు ఐదవ శతాబ్దం నుంచి నేటి సమాజానికి ఎలా వచ్చాడు? లాంటి విశేషాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.