బ్లాక్ మనీ (అన్నీ కొత్త నోట్లే) సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'రన్ బేబి రన్' తెలుగులోకి 'బ్లాక్ మనీ' అన్న పేరుతో అనువాదమై రిలీజవుతోంది. ఇది యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ లాల్, అమలాపాల్, సత్యరాజ్, కైనాత్ అరోర, రమ్య నంబీసన్, రాహుల్ దేవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జోషి వహించారు మరియు నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు.
కథ
వేణు (మోహన్‌లాల్) వీడియో జర్నలిస్టు. రాయటర్ అనే సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. రేణుక (అమలా పాల్) భారత్ విజన్ అనే టెలివిజన్ సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తుంటుంది. వారిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకొంటారు. పెళ్లి చూసుకోవాలని కూడా నిర్ణయించుకొంటారు. పెళ్లికి ముందు వేణుతో కలిసి ఓ కుంభకోణాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ కుంభకోణం విషయంలో వేణును మోసగించాల్సి వస్తుంది. దాంతో వారిద్దరూ విడిపోతారు. చాలా రోజుల తర్వాత ఓ రాజకీయ నేత (సాయికుమార్) చేసే మర్డర్‌ను లైవ్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు. ఓ వ్యక్తిని మర్డర్ చేసే తతంగాన్ని అంతా చిత్రీకరిస్తారు. కానీ ప్లాన్ బెడిసి కొడుతుంది. దాంతో వారు ఇబ్బందుల్లో పడుతారు. వేణు, రేణుకల కోసం పోలీసులు గాలిస్తుండటంతో వారు ఓ ఇంటిలో దాచుకొంటారు. ప్రియుడు వేణును రేణుక ఎందుకు మోసగించింది? మర్డర్ చిత్రీకరించే సమయంలో ఏం జరిగింది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? చివరికి వేణు, రేణుక పెళ్లి చేసుకొన్నారా అనే ప్రశ్నలకు సమాధానమే బ్లాక్ మనీ కథ.