X
తెలుగు » సినిమాలు » బ్లాక్ మనీ
బ్లాక్ మనీ

బ్లాక్ మనీ

Action | Romance | 21 Apr 2017 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బ్లాక్ మనీ స్టోరీ

బ్లాక్ మనీ (అన్నీ కొత్త నోట్లే) సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన 'రన్ బేబి రన్' తెలుగులోకి 'బ్లాక్ మనీ' అన్న పేరుతో అనువాదమై రిలీజవుతోంది. ఇది యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మోహన్ లాల్, అమలాపాల్, సత్యరాజ్, కైనాత్ అరోర, రమ్య నంబీసన్, రాహుల్ దేవ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జోషి వహించారు మరియు నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్ స్వరాలు సమకుర్చరు.    కథ వేణు (మోహన్‌లాల్) వీడియో జర్నలిస్టు. రాయటర్ అనే సంస్థలో కెమెరామెన్‌గా పనిచేస్తుంటాడు. రేణుక (అమలా పాల్) భారత్ విజన్ అనే టెలివిజన్ సంస్థలో సీనియర్ ఎడిటర్‌గా పనిచేస్తుంటుంది. వారిద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకొంటారు. పెళ్లి చూసుకోవాలని కూడా నిర్ణయించుకొంటారు. పెళ్లికి ముందు వేణుతో కలిసి ఓ కుంభకోణాన్ని బట్టబయలు చేస్తుంది. ఆ కుంభకోణం విషయంలో వేణును మోసగించాల్సి వస్తుంది. దాంతో వారిద్దరూ విడిపోతారు. చాలా రోజుల తర్వాత ఓ రాజకీయ నేత (సాయికుమార్) చేసే మర్డర్‌ను లైవ్‌గా చిత్రీకరించాలని ప్లాన్ చేస్తారు. ఓ వ్యక్తిని మర్డర్ చేసే తతంగాన్ని అంతా చిత్రీకరిస్తారు. కానీ ప్లాన్ బెడిసి కొడుతుంది. దాంతో వారు ఇబ్బందుల్లో పడుతారు. వేణు, రేణుకల కోసం పోలీసులు గాలిస్తుండటంతో వారు ఓ ఇంటిలో దాచుకొంటారు. ప్రియుడు వేణును రేణుక ఎందుకు మోసగించింది? మర్డర్ చిత్రీకరించే సమయంలో ఏం జరిగింది? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డారు? చివరికి వేణు, రేణుక పెళ్లి చేసుకొన్నారా అనే ప్రశ్నలకు సమాధానమే బ్లాక్ మనీ కథ.     
Read More

బ్లాక్ మనీ కాస్ట్ & క్రూ

బ్లాక్ మనీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జోషి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత సయ్యద్ నిజాముద్దీన్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బ్లాక్ మనీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
వీడియో జర్నలిస్టుగా మోహన్ లాల్ ఆ పాత్రలో జీవించారు. కెమెరామెన్‌గా ఆయన చూపించిన హావభావాలు ప్రేక్షకుడిని ఆకట్టుకొంటాయి. కీలక సన్నివేశాలలో ఆయన నటన, డైలాగ్స్ డెలివరి బాగున్నాయి. ఇలాంటి పాత్రలు పోషించడం మోహన్‌లాల్‌కు కొట్టిన పిండి అని చెప్పవచ్చు. సీనియర్ ఎడిటర్‌గా అమలాపాల్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించింది. నటన ఎక్కువగా ఫెర్ఫార్మెన్స్ చేయలేని పాత్ర పోషించనప్పటికీ పూర్తిస్థాయిలో న్యాయం చేకూర్చింది. కెరీర్‌ కోసం పాకులాడే జర్నలిస్టు పాత్రలో ఒదిగిపోయింది. జర్నలిజం నేపథ్యంగా కథను దర్శకుడు జోషి ఎంచుకోవడం అభినందనీయం. కానీ తెలుగు నేటివిటికి సరిపోయే కథ కాకపోవడం కొంత ప్రతికూల అంశం. కథలో మరిన్ని ట్విస్టులకు చోటువున్నా వాటిపై దృష్టిపెట్టకపోవడం వల్ల అతి సాధారణమైన సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ పాయింట్. వినోదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే తెలుగు ప్రేక్షకులకు కొంత ఇబ్బందే అనిపిస్తుంది. కాకపోతే విభిన్నమైన కథాంశాలను కోరుకొనే ప్రేక్షకుల ఆదరణ లభించడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లైమాక్స్‌లో దర్శకుడి ప్రతిభ బయటపడుతుంది. పలు స్టింగ్ ఆపరేషన్లలో ఒకే రకమైన సీన్లను చూపించడం వల్ల ప్రేక్షకుడు బోర్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే కథకు బ్లాక్ మనీ అనే టైటిల్ ఏమాత్రం సరితూగకపోవడం ఈ సినిమాకు ప్రధాన సమస్య అని చెప్పవచ్చు.

బ్లాక్ మనీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బ్లాక్ మనీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+