బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ ఒక కామెడీ ఎంటర్టెనర్ సినిమా ఇందులో అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్, హర్షవర్దన్ రాణె, మరియు వీళ్ళతో పాటు బ్రహ్మనందం, వెన్నెల కిశోర్, ఆలీ, జయప్రకాష్ రెడ్డి వీళ్ళందరు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాకు దర్సకత్వం బి చిన్ని నిర్వహించారు, నిర్మాత అమ్మిరాజు కనుమిల్లి నిర్మించారు. సంగీత దర్సకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమాకూర్చారు.
కథ
కథ విషయానికొస్తే... రాంకీ(అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) కవలలు. రాంకీ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ క్యారెక్టర్ అయితే ...లక్కీ చాలా రఫ్ అండ్ డేరింగ్ లేడీ. ఇంటా..బయట ఎక్కడ చూసినా లక్కీ డామినేషనే నడుస్తుంది. పలు సందర్భాల్లో అతన్ని అపాయాల నుండి కాపాడుతుంది కూడా. అదే సమయంలో ఆమె దూకుడు కారణంగా రాంకీ ఇబ్బందులు సైతం పడుతుంటారు.
ఈ క్రమంలో రాంకీ శృతి(మోనాల్ గజ్జర్) ప్రేమలో పడతాడు. కానీ చెల్లి పెళ్లి అయ్యేదా నువ్వు ఆగాల్సిందే అంటూ షరతు పెడతాడు తండ్రి. దీంతో చెల్లి లక్కీకి పెళ్లి చేసేందు సిద్ధమవుతాడు రాంకీ. కానీ లక్కీ తనకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతూ ఉంటుంది. ఆమె ఎందుకు అలా చేస్తుంది? చివరికి రాంకీ పెళ్లి శృతితో ఎలా జరిగింది అనే ఆసక్తికరంగా, నవ్వులు పూయిస్తూ సాగుతుంది.