చంద్రకళ సినిమా ఇది ఒక తమిళ్ చిత్రం అరణ్మనై అనువాదం చంద్రకళ కామిడి థ్రిల్లర్ చిత్రం ఇందులో హన్సిక మొత్వాని, అన్ద్రెజెరెమై, లక్ష్మి రాయి, సుందర్ సి, సంతానం, నితిన్ సత్య, కొవై సరళ, మనొబాల, కాధల్ దండపాణి, చైత్ర లక్ష్మన్, కొట శ్రీనివాన రావు తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం సుందర్ సి నిర్వహించారు. సంగీతదర్శకులు భరత్వాజ్, కార్తీక్ రాజా స్వరాలు సమకుర్చారు.
కథ
జమీందారు బంగ్లా అమ్మకానికి పెడతారు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన వారంతా ఒకరు తర్వాత మరొకరు మాయమవుతూంటారు. దాంతో ఆ భవంతిలో దెయ్యం తిరుగుతోందని,అదే ఇదంతా చేస్తోందని అందరూ భావించి,భయపడతారు. అప్పుడు ఆ ఇంటికి మురళి భార్య అన్న అయిన రవి(సుందర్.సి) వస్తాడు. ఆయన ఈ సంఘటనలు వెనక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఈ లోగా తన చెల్లిలే(ఆండ్రియా) ఈ హత్యలన్నీ చేస్తోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు రవి ఏం చేసాడు...తన చెల్లికీ చంద్రకళ(హన్సిక) కీ సంభంధం ఏమిటి.. ఇంతకీ చంద్రకళ ఎవరు..ఆ భవంతికి చంద్రకళకూ ఉన్న సంభంధం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే మిగతా కథ తెలుసుకోవాల్సిందే.