చెప్పాలని వుంది సినిమా కామెడీ, డ్రామా, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, పృథ్వీ, మురళీ శర్మ, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, రఘుబాబు, అలీ, సత్యం రాజేష్, నంద కిషోర్, అనంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అరుణ్ భారతి ఎల్ వహించారు. నిర్మాతలు వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్ కలిసి నిర్మించారు. సంగీతం అస్లాం కేయి అందించారు.
కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన చంద్రశేఖర్ (యష్ పూరి) ర్యాపిడో డ్రైవర్‌గా, టెలివిజన్ ఛానెల్‌లో న్యూస్ రిపోర్టర్‌గా పనిచేస్తుంటాడు. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో వెన్నెల (సెఫ్టీ పటేల్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం వారి మధ్య ప్రేమగా మారుతుంది. అయితే న్యూస్ రిపోర్టర్‌గా ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా యాక్సిడెంట్‌కు గురవుతాడు. ఆ తర్వాత తెలుగు భాషను మరిచిపోయి.. ఏదో తెలియని భాషను మాట్లాడుతుంటాడు. ర్యాపిడో డ్రైవర్‌గా, న్యూస్ రిపోర్టర్‌గా చంద్రశేఖర్ ఎందుకు పనిచేస్తుంటాడు? జీవితంలో చంద్రశేఖర్ పొగొట్టుకొన్నది ఏమిటి? ఎలాంటి సమయంలో చంద్రశేఖర్‌కు యాక్సిడెంట్ జరిగింది? సత్యమూర్తి (మురళీశర్మ) ఎవరు? భాష మరిచిపోయిన చంద్రశేఖర్‌ను మామూలుగా చేయడానికి డాక్టర్ (రాజీవ్ కనకాల), వెన్నెల ఏం చేశారు. ఫారిన్ లాంగ్వేజ్ సిండ్రోమ్ డిసీజ్ అంటే ఏమిటి? చంద్రశేఖర్ చివరకు మామూలు మనిషి అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే చెప్పాలని ఉంది సినిమా కథ.