సినిమా చూపిస్త మావ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, అవిక గోర్, రావు రమేష్, బ్రహ్మానందం, పోసాని క్రిష్ణా మురళి, సప్తగిరి, సత్య అక్కల, శకలక శంకర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం త్రినాత్రో నక్కిన నిర్వహించారు మరియు నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరాలు సమకుర్చారు.
కథ
కత్తి (రాజ్ తరుణ్) ఇంటర్ కూడా పాస్ కాని ఓ లోఫర్. ఖాళీగా ఉండటం ఎందుకునుకున్నాడో ఏమో...ప్రణీత (అవికా గోర్) తో ప్రేమలో పడతాడు. ఆమె కూడా సర్లే కుర్రాడు కష్టపడుతున్నాడు అని కొద్ది కాలానికి అతని ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఆమె ఇతకి రివర్స్ ...ఇంటర్ స్టేట్ రాంకర్. సర్లే ఇంతవరకూ బాగానే ఉంది మామ అంటే...ఆమె తండ్రి ఎవరూ అంటే.... తండ్రి సోమనాధ్ ఛటర్జీ(రావు రమేష్) చాలా స్ట్రిక్ట్...ఆయన మెడికల్ కౌన్సిల్ లో డిఫ్యూటీ సెక్రటరీ గా చేస్తూంటారు. జీవితంలో ప్రతీది హై క్వాలిటీ కోరుకునే వ్యక్తి. అలాంటి వాడు తన కూతురుని ఇలాంటి లోఫర్ కి ఇవ్వటానికి ఒప్పుకుంటాడా...,ససిమేరా కాదంటారు..అలాగని కూతురు మనస్సుని నొప్పించలేదు..అప్పుడు తెలివిగా ...ఓ కండీషన్ పెడతాడు. తన కూతురు చెయ్యి పట్టుకోవాలంటే...తన కుటుంబాన్ని ఓ నెల పాటు సర్వ ఖర్చులూ భరించాలని, అదీ కత్తి సొంత ఆదాయంతో అని షరతు పెడతాడు. అప్పుడు కత్తి ఏం చేసి ఆ డబ్బు సంపాదించాడు...ఈ క్రమంలో అతనికి ఏం ట్విస్ట్ లు పడ్డాయి. చివరకు ఆమె ను ఎలా పొందాడు అనేది మిగతా కథ.