దాగుడుమూత దండకోర్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బేబి సరా, రాజేంద్ర ప్రసాద్, రవి ప్రకాష్, సిద్దు, నిత్య శేట్టి, అదుర్స్ రఘు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ కె మాలినెని నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఈఎస్ మూర్తి స్వరాలు సమకుర్చారు.
కథ
ఊరి పెద్ద రాజు (రాజేంద్ర ప్రసాద్)గారిది ఉమ్మడి కుటుంబం. కొడుకులు, కోడళ్లు, కూతుర్లు ఇలా అందరూ ఎక్కడెక్కడో సెటిలైపోయారు. మనవరాలు బంగారం(బేబీ సారా) అంటే ఆయనకు ప్రాణం. ఆమెకు నాని (కోడిపుంజు) అంటే చాలా ఇష్టం. ఆ ఊర్లో ఏటా జాతర చేస్తారు. ఆ జాతరకి కుటుంబమంతా కదిలి వస్తుంది. కొన్ని అపశృతులు చోటు చేసుకోవడంతో.....పోలేరమ్మకు మొక్కు తీర్చకపోవడమే ఇందుకు కారణమని భావించిన రాజుగారు, అతని కుటుంబం కోడి పుంజు నాని బలివ్వడానికి నిర్ణయించుకుంటారు. సరిగ్గా నానికి పోలేరమ్మకి బలిచ్చే సమయంలో ఆ కోడి కనిపించకుండా మాయమవుతుంది. అప్పటి నుంచీ ఆ ఇంట్లోవాళ్లంతా కోడిని వెదకడం మొదలెడతారు. కోడిని పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అసలు కోడి ఎందుకు కనిపించకుండా పోయింది? దాని వెనక ఉన్నది ఎవరు? కోడి పుంజు మిస్సయిన తర్వాత రాజుగారి కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసకున్నాయి? అనేది తెరపై చూడాల్సిందే.