X
దర్శకుడు
Action | Romance | 04 Aug 2017 | U |
Telugu

దర్శకుడు స్టోరీ

దర్శకుడు సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశోక్, ఈషా, నోయల్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరి ప్రసాద్ జక్కా వహించారు మరియు నిర్మాతలు బి ఎస్ సి ఎస్ పి విజయ్ కుమార్, థామస్ రెడ్డి అదూరి, రవిదంద్ర సత్తి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు అందించారు.

కథ

కథ విషయానికొస్తే.... మహేష్(అశోక్)కు చిన్నతనం నుండి సినిమా అంటే పిచ్చి. ఆ మాత్రం పిచ్చి ఉంటేనే దర్శకుడు అవుతావు ప్రోసీడ్ అంటూ తండ్రి ప్రోత్సాహం కూడా తోడవటంతో అదే పాషన్‌తో పెరిగిన అశోక్ ప్రతి విషయాన్ని సినిమా కోణంలోనే ఆలోచిస్తాడు. తాను ఏ పని చేసినా సినిమా కోసమే. జీవితంలో జరిగే సంఘటనలు కూడా తన సినిమాకు ఉపయోగపడతాయా? అని ఆలోచించే టైపు. సినిమా పట్ల తనకున్న పాషన్‌ ఏమిటో నిరూపించుకుని మొత్తానికి ఓ నిర్మాతను ఒప్పించి సినిమా అవకాశం దక్కించుకున్న మహేష్ అనుకోకుండా ట్రైన్ జర్నీలో పరిచయం అయిన నమ్రత(ఇషా)తో ప్రేమలో పడతాడు. తన జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ సినిమా అయితే, సెకండ్ ప్రిఫరెన్స్ నమ్రత అనేంతగా ఆమెను ప్రేమిస్తాడు. నమ్రతతో ప్రేమలో పడిన మహేష్‌కు ఒకానొక సందర్భంలో సినిమానా? ప్రియురాలా? అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండింటి మధ్య నలిగి పోయిన మహేష్ చివరకు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+