X
తెలుగు » సినిమాలు » దర్శకుడు
దర్శకుడు

దర్శకుడు

Action | Romance | 04 Aug 2017 | U |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

దర్శకుడు స్టోరీ

దర్శకుడు సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అశోక్, ఈషా, నోయల్, పూజిత పొన్నాడ  తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం హరి ప్రసాద్ జక్కా  వహించారు మరియు నిర్మాతలు బి ఎస్ సి ఎస్ పి విజయ్ కుమార్, థామస్ రెడ్డి అదూరి, రవిదంద్ర సత్తి సంయుక్తంగా నిర్మించారు . ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ స్వరాలు అందించారు. కథ కథ విషయానికొస్తే.... మహేష్(అశోక్)కు చిన్నతనం నుండి సినిమా అంటే పిచ్చి. ఆ మాత్రం పిచ్చి ఉంటేనే దర్శకుడు అవుతావు ప్రోసీడ్ అంటూ తండ్రి ప్రోత్సాహం కూడా తోడవటంతో అదే పాషన్‌తో పెరిగిన అశోక్ ప్రతి విషయాన్ని సినిమా కోణంలోనే ఆలోచిస్తాడు. తాను ఏ పని చేసినా సినిమా కోసమే. జీవితంలో జరిగే సంఘటనలు కూడా తన సినిమాకు ఉపయోగపడతాయా? అని ఆలోచించే టైపు. సినిమా పట్ల తనకున్న పాషన్‌ ఏమిటో నిరూపించుకుని మొత్తానికి ఓ నిర్మాతను ఒప్పించి సినిమా అవకాశం దక్కించుకున్న మహేష్ అనుకోకుండా ట్రైన్ జర్నీలో పరిచయం అయిన నమ్రత(ఇషా)తో ప్రేమలో పడతాడు. తన జీవితంలో మొదటి ప్రిఫరెన్స్ సినిమా అయితే, సెకండ్ ప్రిఫరెన్స్ నమ్రత అనేంతగా ఆమెను ప్రేమిస్తాడు. నమ్రతతో ప్రేమలో పడిన మహేష్‌కు ఒకానొక సందర్భంలో సినిమానా? ప్రియురాలా? అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రెండింటి మధ్య నలిగి పోయిన మహేష్ చివరకు ఏం చేశాడు? అనేది తెరపై చూడాల్సిందే.
Read More

దర్శకుడు కాస్ట్ & క్రూ

దర్శకుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి ప్రసాద్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత సుకుమార్, బి ఎస్ సి ఎస్ పి విజయ్ కుమార్, థామస్ రెడ్డి అదూరి, రవిదంద్ర సత్తి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దర్శకుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
హీరోగా తొలి పరిచయం అయినప్పటికీ అశోక్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించాడు. లుక్స్ పరంగా కూడా ఫర్వాలేదు. హీరోయిన్ ఇషా అందంగా కనిపించడంతో పాటు నేచురల్‌గా నటించింది. పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ‘దర్శుకుడు' కాన్సెప్టు చాలా కొత్తగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం రాసుకున్న కాన్సెప్టును ఉన్నది ఉన్నట్లుగా దించేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులకు ఏమేరకు ఎక్కింది, వాళ్లకు నచ్చిందా? లేదా? అనే కోణంలో ఆలోచిస్తే మాత్రం కాస్త తేడా కొట్టిందనే ఆలోచన కలుగుతుంది. సినిమా కాన్సెప్టు కొత్తగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. స్లో నేరేషన్, చాలా చోట్ల సీన్లు రిపీటైన ఫీలింగ్ రావడంతో కాస్త బోర్ అనిపిస్తుంది. సినిమాలో రెండు మూడు చోట్ల ట్విస్టులున్నా ప్రేక్షకులను అంత ఎగ్జైట్ చేయలేక పోయాయి. సినిమాలో ఎంటర్టెన్మెంట్ మిస్సవ్వడం కూడా మైనస్సే. ఎంటర్టెన్మెంట్ అంటే మధ్య మధ్యలో ప్రక్షకులను నవ్వించడానికి కామెడీ కావాలని ఇరికించడం అనే ఉద్దేశ్యం కాదు. ప్రేక్షకుడు బోర్ ఫీలవ్వకుండా, ప్రతి సీనూ ఎంజాయ్ చేసేలా, ఆస్వాదించేలా సినిమా రన్ చేయడమే. ఇది ఈ సినిమాలో మిస్సయిందనే చెప్పాలి. సినిమాలో ప్లస్, మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే... హీరో అశోక్ సినిమాకు మైనస్ కాదు, అలా అని ప్లస్సూ కాదు. తన పాత్రకు న్యాయం చేశాడంతే. హీరోయిన్ ఈషా ప్లస్ ప్రవీణ్ అనుమోలు సినిమాటోగ్రపీ ప్లస్, సాయి కార్తీక్ సంగీతం జస్ట్ ఓకే. డైలాగులు బావున్నాయి.

దర్శకుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దర్శకుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+