దశావతారం సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, నెపోలియన్, యమ్.ఎస్. భాస్కర్,ఆసిన్ తొట్టుంకళ్, మల్లికా షెరావత్ , జయప్రద, పి.వాసు, నగేష్, సంతాన భారతి, రేఖ, రఘురాం, కె.ఆర్. విజయ తదితరులు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: కె.ఎస్.రవి కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఆస్కార్ రవి చంద్రన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హిమ్మెష్ రేష్మియా స్వరాలు సమకుర్చారు.
కథ
12వ శతాబ్దంలో మొదలైన 'దశావతారం' చిత్ర కథ నేటి కాలంలో ముగుస్తుంది. 12వ శతాబ్దంలో శైవులకు, వైష్ణువులకు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి ఉంటుంది. అప్పటి శైవ రాజు రెండవ కుళోత్తుంగ చోళుని(నెపోలియన్) అరాచకాలతో పేట్రేగి పోతూంటాడు. విష్ణు భక్తుడైన రంగరాజ నంబి(కమల్ హాసన్) ఆ రాజుకు ఎదురు తిరుగుతాడు. దాంతో శివ నామస్మరణ చేయమని అతనిపై రాజు ఒత్తిడి తెస్తాడు. ఒప్పుకోని నంబికి మరణ దండన విధిస్తాడు చోళుడు. తనను ఉరి తీసే సమయంలోనూ నంబి విష్ణు విగ్రహాన్ని వదలడు. ఆ విగ్రహంతో పాటు నంబి మృతదేహాన్ని సముద్రంలో పారేయిస్తాడు చోళుడు. ఆ తర్వాత కథ నేటి కాలంలోకి మారుతుంది. ఈ ఆధునిక కాలంలో కమలహాసన్ అమెరికాలో సైంటిస్టుగా కనపడతాడు.అతను బయోవార్ కి సంభందించిన వైరస్ తయారుచేస్తాడు.కానీ రియలైజ్ అయ్యి దాన్ని అంతం చెయ్యాలనుకుంటాడు. ఒప్పుకోని అక్కడి వారు మరో తెల్లవాడ్ని (మళ్ళీ కమలే) అతన్ని లేపేయమని పురమాయిస్తారు.అక్కడ నుండి వాళ్ళిద్దరూ వాళ్ళద్దరి మధ్యా పిల్లీ ,ఎలుకా గేమ్ స్టార్ట్ అవుతుంది.అందులో ఎవరు విజయం సాధిస్తారు.మిగతా కమల్ పాత్రలూ ఎలా కథలో పాలు పంచుకుంటాయనేది తెరపై చూడాల్సిందే.