దేనికైనా రెడీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, హన్సిక, కోట శ్రీనివాస రావు, సీత, సుమన్, ప్రభు, ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత డా ఎమ్ మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు.
కథ
భాష భాయ్(సుమన్)ని తన చెల్లెలు సరస్వతి(సీత) తనకు ఇష్టం లేకుండా ప్రేమించి మతాంతర వివాహం చేసుకోవటంతో మండిపడతాడు వీర నరసింహ నాయుడు (ప్రభు). ఆ కోపంలో తన చెల్లెలు భర్తని చూడకుండా బాషా కాలు నరికేస్తాడు. దాంతో తన భార్య సరస్వతి కి పుట్టింటి తరుపునుంచి రావాల్సిన ఆస్ధికోసం భాషా కోర్టులో కేసు వేస్తాడు. ఈ సంఘటనతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎడం ఇంకా పెరిగిపోతుంది. ఈ గొడవ ఇలా సాగుతూంటే సరస్వతి,భాషాకు పుట్టిన సులేమాన్ (మంచు విష్ణు) పెరిగి పెద్దవుతాడు. తన తల్లికి తన అన్నతో కలవాలనే కోరిక ఉందని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలని కలపటానికి ఓ ప్లాన్ చేస్తాడు. తన మేనమామ ఇంట్లోకి కృష్ణ శాస్త్రిగా యజ్ఢం చేయటానికి ప్రవేశిస్తాడు. అక్కడ తన మేనమామ కూతురు షర్మిల(హన్సిక) తో ప్రేమలో పడతాడు. అప్పుడేం జరిగింది. తన చెల్లెలే తప్పు చేసి వేరే మతస్దుడుని పెళ్లిచేసుకుందని రగిలిపోయే వీర నరసింహ నాయుడు..ఇప్పుడు తన కూతురు ప్రేమని ఒప్పుకుంటాడా...సులేమాన్ తన తల్లి కోరిక ఎలా తీర్చాడు..తమ రెండు కుటుంబాలకు విలన్ గా ఉన్న రుద్రమనాయుడు(కోట)కి ఎలా బుద్ది చెప్పాడు అన్న విషయాలు తెరపై చూడాల్సిందే.