X
తెలుగు » సినిమాలు » దేనికైనా రెడీ
దేనికైనా రెడీ

దేనికైనా రెడీ

Action | Romance | 24 Oct 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

దేనికైనా రెడీ స్టోరీ

దేనికైనా రెడీ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, హన్సిక , కోట శ్రీనివాస రావు, సీత, సుమన్, ప్రభు, ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: జి.నాగేశ్వర రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత డా ఎమ్ మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రి స్వరాలు సమకుర్చారు. కథ భాష భాయ్(సుమన్)ని తన చెల్లెలు సరస్వతి(సీత) తనకు ఇష్టం లేకుండా ప్రేమించి మతాంతర వివాహం చేసుకోవటంతో మండిపడతాడు వీర నరసింహ నాయుడు (ప్రభు). ఆ కోపంలో తన చెల్లెలు భర్తని చూడకుండా బాషా కాలు నరికేస్తాడు. దాంతో తన భార్య సరస్వతి కి పుట్టింటి తరుపునుంచి రావాల్సిన ఆస్ధికోసం భాషా కోర్టులో కేసు వేస్తాడు. ఈ సంఘటనతో ఈ రెండు కుటుంబాల మధ్య ఎడం ఇంకా పెరిగిపోతుంది. ఈ గొడవ ఇలా సాగుతూంటే సరస్వతి,భాషాకు పుట్టిన సులేమాన్ (మంచు విష్ణు) పెరిగి పెద్దవుతాడు. తన తల్లికి తన అన్నతో కలవాలనే కోరిక ఉందని తెలుసుకుని ఆ రెండు కుటుంబాలని కలపటానికి ఓ ప్లాన్ చేస్తాడు. తన మేనమామ ఇంట్లోకి కృష్ణ శాస్త్రిగా యజ్ఢం చేయటానికి ప్రవేశిస్తాడు. అక్కడ తన మేనమామ కూతురు షర్మిల(హన్సిక) తో ప్రేమలో పడతాడు. అప్పుడేం జరిగింది. తన చెల్లెలే తప్పు చేసి వేరే మతస్దుడుని పెళ్లిచేసుకుందని రగిలిపోయే వీర నరసింహ నాయుడు..ఇప్పుడు తన కూతురు ప్రేమని ఒప్పుకుంటాడా...సులేమాన్ తన తల్లి కోరిక ఎలా తీర్చాడు..తమ రెండు కుటుంబాలకు విలన్ గా ఉన్న రుద్రమనాయుడు(కోట)కి ఎలా బుద్ది చెప్పాడు అన్న విషయాలు తెరపై చూడాల్సిందే.
Read More

దేనికైనా రెడీ కాస్ట్ & క్రూ

దేనికైనా రెడీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చక్రి, యువన్‌శంకర్‌రాజా
నిర్మాత మోహన్ బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దేనికైనా రెడీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
పెద్ద హీరో, చిన్న హీరో అనే బేధబావం లేకుండా హిట్ ఇవ్వగల జెనర్ గా కామెడీ ...తెలుగు పరిశ్రమకు వరంగా మారింది. కథ పాత దైనా, జోకులు కొత్తవైతే చాలు అన్నట్లుగా ఈ కామెడీలు ఫ్యామీలలను అలరిస్తున్నాయి. వరస ప్లాపుల్లో ఉన్న హీరో మంచు విష్ణు ఈ ట్రెండ్ ని చూసే తనకు హిట్ కోసం కామెడీ నే ఆశ్రయించారు. సీమ శాస్త్రి, సీమ టపాకాయి వంటి కామెడీలతో నవ్వించిన జి.నాగేశ్వరరెడ్డి తో జతకట్టి 'దేనికైనా రెడీ' అన్నారు. దిలీప్, గోపిక జంటగా ఉదయపురం సుల్తాన్ (1999) వచ్చిన సినిమా ప్రీ మేక్ గా రూపొందిన ఈ చిత్రం ప్రెడిక్టిబుల్ సీన్స్ తో సాగినా సీజన్డ్ కమిడియన్స్ తో నవ్వించి గట్టెక్కింది.

దేనికైనా రెడీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

దేనికైనా రెడీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+