డిక్టేటర్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాలక్రిష్ణ, అంజలి, సోనల్ చోహన్, బ్రహ్మానందం, పవిత్ర లోకేష్, నాజర్, రవి కిషన్, వెన్నేల కిశోర్, పృద్వి, కాశి విశ్వనాథ్, ప్రభాస్ శ్రీను, హేమ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీవాస్ నిర్వహించారు మరియు నిర్మాణ సంస్థ ఎరొస్ ఇంటర్నషనల్ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ ఎస్ స్వరాలు సమకుర్చరు.
కథ
చందు అలియాస్ చంద్ర శేఖర్ ధర్మ(బాలకృష్ణ) ఓ సూపర్ మార్కెట్ లో సాధారణ ఉద్యోగి. భార్య కాత్యాయిని(అంజలి) తో ప్రశాంత జీవితం గడుపుతున్న అతని జీవితంలోకి ఇందు (సోనాలి చౌహాన్) ప్రవేశిస్తుంది. అప్పటికే ఆమె విక్కీ(విక్రమ్ జీత్) గ్యాంగ్ తో వేధింపులకు గురి అవుతూంటుంది. ఆమెను కిడ్నాప్ చేయటంతో రంగంలోకి దిగిన ధర్మ వారిని ఓ రేంజిలో ఆడుకుంటాడు. అదంతా టీవీలో చూసిన విక్కీ అన్నయ్య రాజశేఖర్(సుమన్) ధర్మని చూసి షాక్ అవుతాడు. వెంటనే డిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ధర్మా మరెవరో కాదు డిక్టేటర్ అని ప్రకటిస్తాడు. అక్కడ నుంచి కథ...డిక్టేటర్ ..ధర్మ గా ఎందుకు మారి సైలెంట్ గా ఉంటున్నాడు..అతని గతం ఏమిటి.. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.