డిస్కొ రాజా సినిమా డ్రామా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ,పాయల్ రాజ్ పుత్, వెన్నెల కిషోర్, తాన్య హోప్, నరేష్, సునీల్, సత్య అక్కల, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వి అనంద్ నిర్మించారు మరియు నిర్మాత రామ్ తళ్ళూరి సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ యస్ స్వరాలు అందించారు.
కథ
ఓ మనిషి హత్యకు గురవుతాడు. మెడికల్ స్టూడెంట్స్‌కు దొరికిన ఆ శవంపై ప్రయోగాలు చేస్తారు. చనిపోయిన మనుషులు బతికించే ఆ ప్రయోగాన్ని ప్రభుత్వం వద్దని చెప్పినా.. అనాథ శవం, ఎలాంటి సమస్య రాదని ప్రయోగం చేసి అతడ్ని బతికిస్తారు. జీవం అయితే పోశారు గానీ గతాన్ని మాత్రం తీసుకురాలేరు. గతం గుర్తుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు గతమెలా గుర్తించింది. చివరకు ఏం జరిగిందనేది కథ.