దొంగాట సినిమా రొమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు లక్ష్మి, అడవి శేషు, బ్రహ్మనందం, ప్రభాకర్, తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ క్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత మంచు లక్ష్మి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య మహవీర్ స్వరాలు సమకుర్చారు.
కథ
వెంకట్ (అడవి శేషు), విజ్జు (మధు), కాటంరాజు (ప్రబాకర్) కలిసి ... స్టార్ హీరోయిన్ శృతి(మంచు లక్ష్మి)ని కిడ్నాప్ చేసి సెటిలైపోవాలనుకుంటారు. కిడ్నాప్ వరకూ విజయవంతంగా చేసి, ఆమె తల్లి (పవిత్ర) నుంచి పది కోట్లు డిమాండ్ చేస్తారు. అంతేకాకుండా...మధు బాస్... అయిన బ్రహ్మీ (బ్రహ్మానందం) ఇంటిలో ఆమెను సేఫ్ గా పెడతారు. బ్రహ్మీ యుఎస్ ఎ లో ఉంటూంటాడు. అనుకోని విధంగా...బ్రహ్మీ... ప్రెవేట్ డిటెక్టివ్ గా ఎంట్రీ ఇచ్చి... ఈ కిడ్నాప్ కేసుని సాల్వ్ చేయటానికి రంగంలోకి దిగుతాడు. ఎప్పుడైతే తన ఇంట్లోనే శృతి ని దాచారని బ్రహ్మికి తెలుస్తుందో అప్పటినుంచే సమస్యలు మొదలవుతాయి. దాంతో ఆ కిడ్నాప్ డ్రామా వీరు అనుకున్నట్లుగా సాగదు. అనుకోని అవాంతరాలు వస్తాయి. తర్వాత ఏమైంది. అసలు కథలో దాగి ఉన్న ఇంకో ట్విస్ట్ ఏమటి...మిగతా కథ.