దొరసాని (2019)(U/A)
Release date
12 Jul 2019
genre
దొరసాని స్టోరి
'దొరసాని' సినిమా 1980 నాటి బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ మూవీలో ఆనంద్ దేవరకొండకు జంటగా రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక, కిశోర్, సరణ్య ప్రదీప్, వినయ్ వెర్మ తదితరులు నటిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ మేకర్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను యశ్ రంగినేని, మధురా శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దగ్గుబాటి సురేశ్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.
కథ
వరంగల్ జిల్లాలోని భూస్వామి (వినయ్ వర్మ) కూతురు దేవకి (దేవకి). గడి జీవితం తప్ప బాహ్య ప్రపంచం తెలియని అమ్మాయి. అదే గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన రాజు (ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకునే యువకుడు. బతుకమ్మ పండుగ సంబురాల్లో కలుసుకొన్న దేవకి, రాజు తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. ఆ క్రమంలో దేవకి, రాజు ప్రేమ భూస్వామి దృష్టికి వస్తుంది.
దేవకి, రాజు ప్రేమపై భూస్వామి ఎలా రియాక్ట్ అయ్యాడు? తన కూతురు ప్రేమను చెడగొట్టడానికి భూస్వామి ఎలాంటి అకృత్యాలకు దిగాడు? తమ ప్రేమను విడగొట్టడానికి ప్రయత్నించిన గడి పెద్దలను ఎదిరించాడా? తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన దేవకి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నది. చివరకు భూస్వామి, ప్రేమికుల మధ్య పరువు, పంతాలు ఎక్కడికి దారి తీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే దొరసాని చిత్రం కథ.
**Note:Hey! Would you like to share the story of the movie దొరసాని with us? Please send it to us ([email protected]).