దృశ్యం 2 సినిమా డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీనా, నదియా, నరేష్, ఎస్తేర్, కృతిక జయకుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జీతూ జోసెఫ్ వహించారు. సురేష్ బాబు నిర్మించారు.
కథ
కేబుల్ బిజినెస్ చేసే రాంబాబు (వెంకటేష్) సినిమా థియేటర్ ఓనర్‌గా మారారు. సినిమా తీయడమే తన జీవిత లక్ష్యంగా బతుకుతున్న రాంబాబును గతంలో జరిగిన వరుణ్ హత్య తన కుటుంబాన్ని వెంటాడుతుంది. సాఫీగా సాగుతున్న రాంబాబు జీవితంలోకి మళ్లీ పోలీస్ ఆఫీసర్ గీతా ప్రభాకర్ (నదియా), ప్రభాకర్ (నరేష్) మళ్లీ ప్రవేశిస్తారు. దాంతో మళ్లీ రాంబాబు కుటుంబం ఇబ్బందుల్లో పడుతుంది.
ఆరేళ్ల క్రితం మరణించిన తన కొడుకు వరుణ్ కేసును ఎందుకు గీతా ప్రభాకరన్ దంపతులు తిరిగదోడారు? రాంబాబు నుంచి వారు ఏం ఆశించారు? గీతా ప్రభాకరన్ దంపతుల కోరికను రాంబాబు ఎందుకు తిరస్కరించాడు? రాంబాబు సినిమా తీసి తన లైఫ్ టైమ్ కోరికను తీర్చుకొన్నాడా? పోలీస్ అధికారి కొడుకు మరణం వెంటాడుతున్న నేపథ్యంలో రాంబాబు ఏం చేశాడు? పోలీస్ స్టేషన్‌లో పూడ్చిన వరుణ్ శవాన్ని పోలీసులు కనుగొన్నారా? ఒకవేళ వరుణ్ శవం లభించిన తర్వాత రాంబాబుకు శిక్ష పడిందా? లేదా వరుణ్ హత్య కేసు నుంచి రాంబాబు సమస్య నుంచి ఎలా గట్టెక్కాడు? ఈ కథలో ప్రఖ్యాత రచయిత విజయ్ చంద్ర పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే దృశ్యం 2 సినిమా కథ.