ఈడోరకం ఆడోరకం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు, రాజ్ తరుణ్, సోనారిక భడోరియా, హెబ్బ పటేల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి నిర్వహించారు మరియు నిర్మాత రామబ్రహ్మం సుకన్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.
కథ
కేసులు లేని లార్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఆస్తులు లేని పోలీసాఫీసర్ కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) ఇద్దరూ క్లోజ్ ప్రెండ్స్. అల్లరి చిల్లరగా తిరేగే వీరికి ఓ పెళ్లిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హేబ పటేల్) పరిచయం అవుతారు. అర్జున్ నీలవేనిని ప్రేమిస్తే... అశ్విన్ సుప్రియని ప్రేమిస్తాడు. అయితే అనాథనే పెళ్లి చేసుకోవాలనే నీలవేని నిర్ణయించుకోవడంతో తాను అనాధను అని చెప్పి ఆమెను ప్రేమలోకి దింపుతాడు అర్జున్. బాగా డబ్బున్న వాన్ని పెళ్లి చేసుకోవాలనేది సుప్రియ కోరిక. అశ్విన్ కూడా సుప్రియకు అబద్దం చెప్పి ప్రేమలో పడేస్తాడు. నీలవేణి అన్న గజన్న(అభిమన్యు సింగ్) పెద్ద గుండా. అనుకోని పరిస్థితుల్లో అర్జున్ తన తండ్రికి తెలియకుండనే నీలవేణిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లి తర్వాత రౌడీల మధ్య ఉండటం ఇష్టంలేని నీలవేణి వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకుంటుంది. అంతలోనే పేపర్లో నారాయణ వేసిన ఇంటి అద్దె యాడ్ చూసి అతన్ని కలుస్తుంది. ఇల్లు నచ్చడంతో అర్జున్‌కు తెలియకుండానే అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తుంది. తన ఇంట్లోకే తన భార్యతో కలిసి అద్దెకు వెళ్లాల్సి వస్తుంది అర్జున్. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన పెళ్ళి విషయం కుటుంబానికి తెలీకుండా నీలవేణిని అశ్విన్ భార్యగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. ఆస్తిపాస్తులు ఉన్న వాడికే తన చెల్లిని ఇచ్చి పెల్లి చేస్తాననే ఉద్దేశ్యంతో ఉన్న దత్తన్న(సుప్రీత్)కు తాను లాయర్ నారాయణ కొడుకును అని అబద్దం చెప్పి సుప్రియను పెళ్లాడతాడు. ఇలా అబద్దాలు చెప్పి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, చివరకు కథ ఎలా సుఖాతం అయింది అనేది తెరపై చూడాల్సిందే.