ఈగ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, సమంత, సుదీప్, ఆదిత్య మీనన్, దేవదర్శిని, నోయల్, హంసానందిని తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి నిర్వహించారు మరియు నిర్మాత సాయి కొర్రపాటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
మొదటి నుంచీ తెలుసిన కథనే మళ్లీ చెప్పుకుంటే...సరదా కుర్రాడైన నాని (నాని)ఎదురింటి అమ్మాయి బిందు (సమంత)ని ప్రేమిస్తాడు. అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందనే సమయానికి రావణాసుడులా సుదీప్ (సుదీప్)ఆమెపై కన్నేసి అడ్డుపడతాడు. అంతేగాక ఆమెను దక్కించుకోవటం కోసం నానిని దారుణంగా హత్య చేస్తాడు. అయితే కథ అక్కడితో అయిపోదు.. మగధీరలా నాని.. మరుజన్మ ఎత్తుతాడు. అయితే ఈ సారి ఈగ గా జన్మిస్తాడు. గతజన్మ స్మృతులతో తన ప్రేయసిని కాపాడుకునేందుకు సుదీప్ పై ఎడతెగని యుద్దం ప్రకటిస్తాడు. ఆ క్రమంలో ఏం జరిగింది. ఎలా బలవంతుడైన సుదీప్ నుంచి అతి సాధారణమైన ఈగ అయిన తాను .. తన ప్రేయసిని తప్పించాడు అనేది మిగతా కథ.