ఈనాడు సినిమా యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కమల్ హాసన్, వెంకటేష్, లక్ష్మి, గణేష్ వెంకట్రామన్, అనూజూ అయ్యర్, పూనం కౌర్, సంతానం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చక్రి తోలేటి నిర్వహించారు మరియు నిర్మాత కమల్ హాసన్ నిర్వహించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రుతి హాసన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథలో పోలీస్ కమీషనల్ ఈశ్వర్ ప్రసాద్(వెంకటేష్) కి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు(కమల్ హాసన్) నుంచి ఓ బెదిరింపు కాల్ వస్తుంది. తాను ఐదు ఆర్డిక్స్ బాంబులను సిటీలో పెట్టానని...అవి ఆరు గంటలకు పేలుతాయని అంటాడు. దాంతో ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ(లక్ష్మి)కి విషయం తెలియచేసిన ఈశ్వర్ ప్రసాద్ పరిస్ధితిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతని లక్ష్యాలు రెండు..మెదటిది సిటీని ఆ బాంబు ప్రేలుళ్ళ నుంచి రక్షించటం, రెండు ఆ ఆగంతుకుడు ఎవరో కనుక్కోవటం. ఆ ప్రాసెస్ లో అతని డిమాండ్స్ తెలుసుకుంటాడు. ఆ ఆగంతుకుడు జైల్లో ఉన్న నలుగురు టెర్రరిస్టులును విడిచిపెట్టమంటాడు. వాళ్ళు గోకుల్ చాట్, లుంబనీ పార్క్ బాంబు ప్రేలుళ్ళలకు కారకులు. దానికి అంగీకరించిన ఈశ్వర్ ప్రసాద్ వారిని ఆ ఆగంతుకుడు చెప్పిన చోటకి పంపుతాడు. అప్పుడు ఏం జరిగింది. ఈశ్వర్ ప్రసాద్ తన మిషన్ లో ఎలా సక్సెస్ అయ్యాడు అన్నదే మిగతా కథ.