ఏక వీర సినిమా పీరియడ్ డ్రామా చిత్రం ఇందులో ఆది, దన్సిక, అర్చనాకవి, అంజలి,పశుపతి, విజయచందర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం బాబి నిర్వహించారు మరియు నిర్మాత దామోధర్ శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కార్తీక్ స్వరాలు సమకుర్చారు.
కథ
18వ శతాబ్దంలో జరిగే ఈ కథ ఎక్కడినుంచో వచ్చిన చిన్నా(ఆది)ని అతని శక్తి యుక్తులు నచ్చి .. పశుపతి తాను నడిపే దొంగల ముఠాలో చేర్చుకోవటంతో మొదలవుతుంది. తానెవరో ఎక్కడనుంచి వచ్చాడో చెప్పకుండా దాచిపెట్టి చిన్నా ఆ ముఠాతో కలిపి దొంగతనాలు చేస్తూ వాళ్లతో కలిసిపోతాడు. అయితే అనుకోని పరిస్ధితిల్లో ఓ చోట దొంగతనాకి వెళ్లి అక్కడ బిళ్లూ అనే కాపలా వ్యక్తి గుర్తు పట్టి వెంటబడి చంపటానికి ప్రయత్నంచటంతో వేడెక్కుతుంది. ఇంతకీ బిళ్లూ ఎవరు... ఎందుకు చిన్నా అలా దొంగగా మారి అజ్ఠాత వాసం చేయాల్సివచ్చిందనేది అనేది మిగతా కథ.