ఏనుగు సినిమా యాక్షన్, రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముతిర కని, ‘కేజీఎఫ్’ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు తదితరులు నటించారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ‘ఏనుగు’ చిత్రాన్ని సిహెచ్. సతీశ్ కుమార్ నిర్మించారు.
కథ
కాకినాడ ప్రాంతంలో పీవీఆర్, సముద్రం కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. పీవీఆర్ కుటుంబానికి, తన సవతి తల్లి కొడుకులు (సముద్రఖని, బోస్ వెంకట్, సంజీవ్)కు రవి (అరుణ్ విజయ్) కొండంత బలంగా ఉంటాడు. సముద్రం కుటుంబానికి చెందిన లింగం (కేజీఎఫ్ గురుడ రామ్)తో రవికి వైరుధ్యం ఉంటుంది. ఈ క్రమంలో తన అన్న (సముద్రఖని) కూతురు దేవీ (అమ్ము అభిరామి) ముస్లిం యువకుడితో లేచిపోతుంది. సముద్రం, పీఆర్వీ కుటుంబానికి వైరుధ్యం ఎందుకు ఏర్పడింది? ఈ రెండు కుటుంబాలు పగ, పత్రీకారంతో ఎందుకు చెలరేగిపోతాయి. తొలి చూపులోనే ఇష్టపడిన క్రిస్టియన్ యువతి (ప్రియా భవానీ శంకర్) తో రవి ప్రేమ ఎలాంటి మలుపు తిరిగింది? ప్రేమించిన వ్యక్తితో అన్న కూతురు లేచిపోవడంతో రవి ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు?. తన తండ్రి మరణం కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెట్టింది? తనను చంపాలని పథకం వేసిన అన్న (సముద్రఖని)కి ఎలాంటి గుణపాఠం నేర్పాడు. తన అన్న కూతురు ఎత్తికెళ్లిన లింగంలో మార్పుకు రవి ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఏనుగు కథ.